Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu: ఫ్లాట్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఇవి చెక్‌ చేసుకోండి..

చిన్న చిన్న పట్టణాల్లోనూ వెలుస్తున్నాయి. భూమి ధరలు విపరీతంగా పెరగడం, ఇండిపెండెంట్‌ ఇంటి నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుండడంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇండిపెండెంట్ హౌజ్‌ నిర్మాణం విషయంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో.. ఫ్లాట్‌ కొనుగోలు విషయంలో కూడా వాస్తును తూచా తప్పకుండా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు...

Vastu: ఫ్లాట్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఇవి చెక్‌ చేసుకోండి..
Vastu For Apartments
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 18, 2023 | 9:18 AM

ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్స్‌ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లోనూ వెలుస్తున్నాయి. భూమి ధరలు విపరీతంగా పెరగడం, ఇండిపెండెంట్‌ ఇంటి నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుండడంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇండిపెండెంట్ హౌజ్‌ నిర్మాణం విషయంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో.. ఫ్లాట్‌ కొనుగోలు విషయంలో కూడా వాస్తును తూచా తప్పకుండా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటే వీలైనంత వరకు గ్రౌండ్‌ ఫ్లోర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోతుండొచ్చు కానీ ప్రయత్నించాలి. ఇక ప్రస్తుత తరుణంలో పార్కింగ్‌ సెల్లార్స్‌ను నిర్మిస్తుండడంతో అసలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లు అనేవి ఉండడం లేదు.

* ఇక అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలన్న విషయంలో కూడా వాస్తు పండితులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. మొదటి ఐదు ఫ్లోర్స్‌లో ఫ్లాట్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* మరీ ముఖ్యంగా ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం 1 సంఖ్య ఏదైనా శుభ ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే.. 1వ అంతస్తు స్వేచ్ఛ, కోరికను సూచిస్తుంది. ఫెంగ్ షుయ్‌లో నంబర్ 1 కూడా చాలా అదృష్టంగా పరిగణిస్తారు.

* ఇదిలా ఉంటే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే సమయంలో అది ఏ దిశలో ఉందన్న విషయాన్ని కూడా గమనించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. తూర్పు, ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉన్న అపార్ట్‌మెంట్‌లు నివాస వినియోగానికి మంచివని వాస్తు పండితులు చెబతున్నారు.ఇక దక్షిణం వైపు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్‌ కొనుగోలు చేయకూడదు.

* అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసే సమయంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలో నీటి వనరులు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఫ్లాన్‌ కొనుగోలు చేయకపోవడమే మంచిది.

* ఇక ఫ్లాట్స్‌లో వంటగది మెయిన్‌ డోర్‌కి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగి నిత్యం కలహాలు, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందిచనవి. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..