Dream: పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..

కలలు కనడం సర్వసాధారణమైన విషయం. అయితే కలలో ఎన్నో రకాల అంశాలు కనిపిస్తుంటాయి. వీటికి ఎన్నో అర్థాలు ఉంటాయి. రాత్రి పడుకున్న సమయంలో పరీక్షలో ఫెయిల్‌ అయినట్లు కనిపిస్తే దాని అర్థం ఏంటి.? ఇది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం...

Dream: పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2024 | 6:03 PM

పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక నిర్ధిష్టమైన అర్థం ఉంటుందని చెబుతుంటారు. కేవలం పండితులు మాత్రమే కాకుండా స్వప్న శాస్త్రంలో కూడా దీనికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి. కలలు ఎన్నో రకాలు ఉన్నట్లే వాటి అర్థాలు కూడా విభిన్నంగా ఉంటాయి.

అలాంటి వాటిలో ఒక కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షలో ఫెయిల్‌ అయినట్లు కలలో కనిపిస్తే ఎలాంటి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కల కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. కలలో పరీక్ష రాస్తున్నట్లు కనిపిస్తే. మీరు ఏదో కష్టాన్ని ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఉద్యోగంలో కావొచ్చు, ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఒకవేళ పరీక్షలో విఫలమైనట్లు కలలు వస్తే.. మీలోని అభద్రత, ఆందోళనకు చిహ్నంగా భావించాలి. ఏదో విషయంలో మీరు భయంతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలంటే భయంతో ఉన్నారని అర్థం. కొత్త పని మొదలు పెడితే ఫెయిల్ అవుతానన్న ఆందోళనతో ఇబ్బంది పడుతుంటారు. ఇక పరీక్షలో ఫెయిల్‌ అయినట్లు కల వస్తే.. మీరు అలసిపోయిన భావనతో ఉన్నారని అర్థం చేసుకోవాలి.

చాలా వరకు పరీక్షకు సంబంధించిన కలలు రావడం ఒత్తిడికి సంకేతంగా భావించాలి. ఏదో విషయంలో తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక ఒకవేళ పరీక్షకు ఆలస్యమవుతున్నారని కలలో కనిపిస్తే.. మీరు ఏదో మంచి అవకాశాన్ని కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి కలలు వస్తే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..