Dream: కలలో తేనె కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.?
కలలో కనిపించే అంశాలు మన నిజమైన జీవితంపై ప్రభావం చూపుతుందని పండితులు అంటున్నారు. కలలో కనిపించే ఒక్కో అంశం, ఒక్కో అర్థాన్ని చెబుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఒకవేళ కలలో తేనె కనిపిస్తే ఎలాంటి వాటికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం...
రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే కలలో రకరకలా సన్నివేశాలు, వ్యక్తులు, వస్తువులు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండా మన కలలో కనిపించే వస్తువులకు పలు రకాల అర్థాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు. స్వప్న శాస్త్రంలో ఇందుకు సంబంధించి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కలలో తేనె కనిపించే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె కలలో కనిపించే విధానం ఆధారంగా వాటి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ కలలో శుభ్రంగా ఉన్న తేనె కలలో కనిపిస్తే మీకు తరతరాలకు సరిపోయే సంపద మీరు సంపాదించబోతున్నారని అర్థం. ఊహించని విధంగా సంపద వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
ఇక ఒకవేళ తేనె చేతులో నుంచి జారిపోయినట్లు కనిపిస్తే మాత్రం చెడుకు సంకేతమని పండితులు అంటున్నారు. మీరు కష్టపడి చేసిన పని వృధా అవుతుందని అర్థం చేసుకోవాలి. చేసే పనిలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అపజయాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కలలో తేనె టీగలు వెంటబడుతున్నట్లు కనిపిస్తే.. మీరు చేస్తున్న పనిని కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారి అర్థం చేసుకోవాలి. వెనక్కి లాగేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గుర్తించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..