బాగా మరిగిస్తే పాలు పొంగుతాయి, కానీ నీరు పొంగదు.. కారణం ఏంటో తెలుసా.?
సహజంగా పాలలో కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటు గరిష్టంగా నీరు కూడా ఉంటుంది. దీంతో పాలను వేడి చేసిన సమయంలో సహజంగానే పాలతో పాటు అందులోని నీరు కూడా వేడెక్కుతాయి. దీంతో నీరు ఆవిరై పాత్ర నుంచి పైకి వస్తుంది. అయితే పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ వంటి మూలకాలు చిక్కాగా మారి పాలపై ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీంతో....

కొత్తగా ఇంట్లోకి వెళితే.. పాలు పొంగించడం సర్వసాధారణమైన విషయమే. దీనిని శుభప్రదంగా భావిస్తుంటాం. అదే పదే పదే పాలు పొంగిపోతే మాత్రం దానిని అపశకునంగా భావించే వారు కూడా ఉంటారు. అయితే పాలను బాగా మరిగిస్తే పొంగి పోతాయనే విషయం మనకు తెలుసు. కానీ నీటిని మరిగిస్తే మాత్రం పాలలో పొంగినట్లు పొంగవు, ఇంతకీ పాలు పొంగడానికి, నీరు పొంగకపోవడం వెనకాల ఒక కారణం దాగి ఉంది. ఇంతకీ దీని వెనకాల లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సహజంగా పాలలో కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటు గరిష్టంగా నీరు కూడా ఉంటుంది. దీంతో పాలను వేడి చేసిన సమయంలో సహజంగానే పాలతో పాటు అందులోని నీరు కూడా వేడెక్కుతాయి. దీంతో నీరు ఆవిరై పాత్ర నుంచి పైకి వస్తుంది. అయితే పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ వంటి మూలకాలు చిక్కాగా మారి పాలపై ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీంతో ఆవిరి బయటకు వెళ్లకుండా పొర అడ్డుపడుతుంది.
ఈ కారణంగానే ఆవిరి బయటకు వెళ్లడానికి స్థలం లేకపోవడంతో, పాలపై ఏర్పడిన పొరను బయటకు నెట్టివేస్తుంది. దీంతో ఒక్కసారిగా పాలన్ని పొంగిపోతాయి. మరి నీరు ఎందుకు పొంగిపోవో ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో ఉండే.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ లాంటి ఎలిమెంట్స్, నీటిలో ఉండవు ఈ కారణంగానే నీటిని మరిగిస్తే.. మరుగుతుంది కానీ పొంగి బయటకు రావు. పాలను మరిగిస్తే పొంగడానికి, నీరు పొంగగకపోవడం వెనకాల ఉన్న అసలు కారణం ఇదే.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..