Fact: గురివింద వెనుక ఇంత కహానీ ఉందా.? బంగారాన్ని తూచేందుకు ఎందుకు ఉపయోగించేవారు

అయితే గురివింద గింజల వెనకాల ఎంతో పెద్ద కథ ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఈ గింజలను బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తుండం చూసే ఉంటాం. మరి ఈ గింజలను బంగారం బరువు కొలిచేందుకు ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ గింజలు ఏ మొక్క నుంచి వస్తాయి.? లాంటి ఆసక్తికర విషయాలను ఓ నెటిజన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో...

Fact: గురివింద వెనుక ఇంత కహానీ ఉందా.? బంగారాన్ని తూచేందుకు ఎందుకు ఉపయోగించేవారు
Gurivinda Ginja
Follow us

|

Updated on: Sep 23, 2024 | 6:24 AM

గురివింద గింజ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే.. ‘గురివింద గింజ తన నలుపెరగదంట’ అనే ఈ సామెత గుర్తు రావడం సర్వసాధారణం. గురివింద పై భాగం మొత్తం ఎర్రగా ఉండి కింది భాగంలో మాత్రం నల్లగా ఉంటుంది. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. మనుషులు కూడా తమలోని తప్పులను తెలుసుకోలే ఇతరులను తప్పు పడతారన్న అర్థం వచ్చేలా ఈ సామెతను ఉపయోగిస్తారు.

అయితే గురివింద గింజల వెనకాల ఎంతో పెద్ద కథ ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఈ గింజలను బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తుండం చూసే ఉంటాం. మరి ఈ గింజలను బంగారం బరువు కొలిచేందుకు ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ గింజలు ఏ మొక్క నుంచి వస్తాయి.? లాంటి ఆసక్తికర విషయాలను ఓ నెటిజన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో వివరంగా తెలిపారు..

ఈ గింజలు గూంజ్‌ మొక్క నుంచి వస్తాయి. దీనిని సాధారణంగా రోసరీ బఠానీ అని కూడా పిలుస్తుంటారు. ఏడాది పొడవునా ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతుంటాయి. గురివింద గింజలను మొదట్లో బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగించేవారు. దీనికి కారణం ఈ గింజలన్నీ దాదాపు ఒకే బరువలో ఉంటాయి. అందుకే వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. దేశంలో తొలిసారి బంగారం, వెండిని కొలిచేందుకు ఈ గింజలే ఉపయోగించేవారు. త్రాసులో ఒకవైపు గింజలు వేసి మరో వైపు బంగారాన్ని మెజర్ చేసేవారు.

ఈ గింజల బరువును రతిగా చెప్తుంటారు. ఒక రతి 1.5 మిల్లీగ్రాములతో సమానమైన బరువుతో ఉంటుంది. ఇక ఈ మొక్క ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆకులను మనం తినే పాన్‌లలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా స్వీట్‌ పాన్స్‌లో రుచి రావడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇదండీ మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైన గురివింద గింజలు, ఆ మొక్క వెనకాల ఉన్న చరిత్ర.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..