Blood Rain: ఈ ప్రాంతాల్లో ర‌క్త‌పు వ‌ర్షం కురుస్తుంది.. కార‌ణం ఏంటంటే..

ఈ ప్ర‌పంచంలో ఎన్నో వింత‌ల‌కు, మ‌రెన్నో విశేషాల‌కు నెల‌వు. ఈ విశ్వం త‌న‌లో ఎన్నో అద్భుతాల‌ను దాచుకుంది. ఈ ప్ర‌కృతిలో కూడా ఎన్నో వింత‌లు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్న‌ప్పుడు మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అలాంటి ఓ వింత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Blood Rain: ఈ ప్రాంతాల్లో ర‌క్త‌పు వ‌ర్షం కురుస్తుంది.. కార‌ణం ఏంటంటే..
Blood Rain
Follow us

|

Updated on: Aug 02, 2024 | 3:43 PM

ఈ ప్ర‌పంచంలో ఎన్నో వింత‌ల‌కు, మ‌రెన్నో విశేషాల‌కు నెల‌వు. ఈ విశ్వం త‌న‌లో ఎన్నో అద్భుతాల‌ను దాచుకుంది. ఈ ప్ర‌కృతిలో కూడా ఎన్నో వింత‌లు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్న‌ప్పుడు మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అలాంటి ఓ వింత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధార‌ణంగా వ‌ర్షం నీరు ఏ రంగులో ఉంటుంది.? సాధార‌ణంగా ఉండే నీటి రంగులోనే ఉంటుంది. మ‌హా అయితే కాస్త బ్లూ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. అయితే ప్ర‌పంచంలో కొన్ని చోట్ల వ‌ర్షం ఎరుపు రంగులో కురుస్తుంద‌ని మీకు తెలుసా.? అచ్చంగా ర‌క్తాన్ని పోలిన‌ట్లు ఉంటుంది కాబ‌ట్టే ఈ వ‌ర్షాన్ని ర‌క్త‌పు వ‌ర్షంగా చెబుతుంటారు. ఇంత‌కీ ఈ వ‌ర్షం ఎక్క‌డ కురుస్తుంది.? అసలు ర‌క్త‌పు వ‌ర్షం కుర‌వ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటలీలో కొన్ని చోట్ల ఎరుపు రంగు వ‌ర్షం కురుస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ దేశంలో ర‌క్తపు వ‌ర్షం కురిసింది. ఇంత‌కీ ర‌క్తపు వ‌ర్షం ఎందుకు కురుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ‌ర్షపు నీటిలో ఇసుక రేణువులు క‌రిగిపోవ‌డ‌మే ఈ ఎరుపు రంగు వ‌ర్షానికి కార‌ణం. భూమిపై నుంచి గాల్లోకి వెళ్లిన ఎరుపు రంగు ఇసుక రేణువులు నీటిలో క‌రిగిపోయి, తిరిగి భూమిని చేరుకోవ‌డం వ‌ల్లే వ‌ర్షం ఎరుపు రంగులో కురుస్తుంది.

అయితే ర‌క్తపు వ‌ర్షం భార‌త్‌లో కూడా కురిసిన సంద‌ర్భాలు ఉన్నాయి. 2001లో కేర‌ళ‌లో ఒక‌సారి ర‌క్త‌పు వ‌ర్షం కురిసింది. కేర‌ళ‌లోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఎరుపు రంగుతో కూడిన వ‌ర్షం కురిసింది. అలాగే శ్రీలంక‌లోనూ ఇలాంటి వ‌ర్షం కురిసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ర‌క్త‌పు వ‌ర్షం కుర‌వ‌డానికి ఆల్గే కూడా ఒక కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌ర్ష‌పు నీటిలో ఆల్గే ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వ‌ర్ష‌పు నీరు ఎర్ర‌గా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..