Diwali Festival: కుటుంబంలో మరణం సంభవిస్తే దీపావళి పండగ జరుపుకోవచ్చా?
Diwali 2024: దీపావళి అనేది ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. దీపావళి పండగ వచ్చిందంటే చాలు ఎంతో ఆనందంగా జరుపుకొంటారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతటా ఈ పండగను ఘనంగా జరుపుకొంటారు..
దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇది హిందూ మతం ప్రత్యేక పండుగ. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు జరుపుకొంటే మరి కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకొంటారు. దీపావళి అనేది వెలుగులు, సంతోషాల పండుగ. అయితే దీపావళి పండుగను ఏ పరిస్థితుల్లో జరుపుకోకూడదో తెలుసుకుందాం.
కుటుంబంలో మరణం తర్వాత దీపావళి పండుగ జరుపుకోవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అందుకే మన మత గ్రంధాలలో పుట్టుక నుండి మరణం వరకు నియమాలు పేర్కొనబడ్డాయి. వివిధ పరిస్థితులకు అనుగుణంగా మనం ఈ నియమాలను పాటిస్తుంటాము. ఈ నియమాలను పాటించడం ద్వారా కుటుంబం సమస్యలు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
కుటుంబంలో మరణం సంభవిస్తే దీపావళి జరుపుకోవచ్చా?
మతపరమైన కోణంలో దీపావళి రోజున కుటుంబంలో మరణం సంభవిస్తే, ఆ రోజు పండుగ జరుపుకోరు. ఎందుకంటే ఈ సమయంలో పూజ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటాము. ఎందుకంటే ఈ కాలంలో సూతక్ కాలం 10 రోజుల నుండి ఒక నెల వరకు ఉంటుంది. సూతకం పాటించేటప్పుడు కుటుంబం పండుగలు జరుపుకోకూడదు. అలాగే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించాలి.
అదే సమయంలో దీపావళి రోజున మరణం సంభవించినప్పుడు చాలా కుటుంబాలు ఈ పండుగను సంవత్సరాల తరబడి జరుపుకోరు. ఎందుకంటే పండుగ సమయంలో కుటుంబంలోని ఎవరైనా చనిపోతే ఆ పండుగ చెల్లదని భావిస్తారు.
సాధారణ నమ్మకాల ప్రకారం.. కుటుంబ సభ్యుడు మరణించిన రోజు లేదా సంవత్సరంలో దీపావళి జరుపుకోకూడదు. కానీ ఆ కుటుంబంలో అప్పుడే పుట్టినా లేదా అదే రోజు కొత్త వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని చెబుతారు.
(నోట్: ఇందులోని అంశాలు మత విశ్వాసాలు, ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. నిపుణులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము).
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి