AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Color Car: బ్లాక్ కలర్ కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే..

Car Maintenance: నలుపు రంగును ఈ మధ్య సెలబ్రేటీ కలర్ అంటున్నారు. ఇది మాత్రమే కాదు.. నలుపు రంగు కారు ఇతర రంగుల కంటే ఖరీదైనది. అంటే నలుపు రంగును ఇష్టపడే వారు ఎక్కువగా ఉండటంతో ఈ రంగుకు భారీ డిమాండ్ ఉంది.

Black Color Car: బ్లాక్ కలర్ కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే..
Black Color Car
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2023 | 2:11 PM

Share

Black Color Car Maintenance Expenses: ప్రస్తుతం కారు కొనడం విలాసంగా కాకుండా నిత్యావసరంగా మారింది. నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా కారు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే కారు కొనే ముందు చాలా సెర్చ్ చేస్తుంటాం. మీరు కూడా బ్లాక్ కలర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. బుకింగ్ చేయడానికి ముందు బ్లాక్ కలర్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీ జేబుపై ఎంత భారం పడుతుందో ముందే గుర్తించడండి. అనే 3 విషయాలను మీరు తప్పక తెలుసుకోవాలి. నలుపు రంగు చాలా స్టైలిష్ రంగు.. అందుకే చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఇది మాత్రమే కాదు. నలుపు రంగు కారు ఇతర రంగుల కంటే ఖరీదైనది. అంటే నలుపు రంగును ఇష్టపడే వారు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో.. నలుపు రంగును కొనుగోలు చేసే ముందు మీరు 3 విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

నలుపు రంగులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ రంగు ఇతర లేత రంగుల కంటే సూర్య కిరణాల నుంచి ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. కారు రంగు విషయంలో కూడా అదే జరుగుతుంది. నలుపు రంగు కార్లు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీని కారణంగా కారు లోపలి భాగం వెచ్చగా ఉంటుంది. ఎండలో కారును పార్క్ చేసినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కారు లోపలి భాగాన్ని చల్లబరచడానికి మీకు కారు AC అవసరం.. దాని కారణంగా ఇది మైలేజీపై ప్రభావం చూపుతుంది.

నలుపు రంగు మరింత మెయింటెనెన్స్ కోరుతుంది..

ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు కారుకు ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం. పెయింట్ పరంగా, నలుపు రంగు మసకబారడం మొదలైతే ఆ మెరు కనిపించదు. కాబట్టి మరింత మెయింటెనెన్స్ అవసరం. దీని కోసం, కారుకు రోజూ పాలిషింగ్, వ్యాక్సింగ్ అవసరం. ఇది కాకుండా, కారును కడిగిన తర్వాత, కొన్నిసార్లు కొన్ని మచ్చలు లేదా వాటర్ స్ప్లాష్ రకం మరకలు ఉంటాయి. దీని కోసం కారును జాగ్రత్తగా కడగడం అవసరం.

నలుపు రంగుపై గీతలు, ధూళి భయం

లేత రంగు కారు కంటే నలుపు రంగు కారులో ధూళి, దుమ్ము, స్క్రాచ్ మార్క్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, నలుపు రంగు కారు ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండటానికి మరింత శుభ్రపరచడం అవసరం. ఇది కాకుండా, కారుపై చిన్న గీతలు కూడా కనిపిస్తాయి. ఇది సాధారణంగా కారు యజమానులు ఇష్టపడరు. గీతలను పదేపదే తొలగించడానికి లేదా పెయింటింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం