AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPTతో ఆ విషయాలను పంచుకుంటున్నారా?.. అయితే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే!

ప్రస్తుత ఏఐ యుగంలో తమ సమస్యలను క్లియర్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఏఐను ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ChatGPTని వినియోగిస్తున్నారు. కొందరు తమ వ్యక్తిగత విషయాలను కూడా ChatGPTతో పంచుకుంటున్నారు. అయితే ChatGPT వంటి AI సాధనాలతో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మంచిది కాదని Open AI సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ హెచ్చరించారు. ChatGPTలో మీ వ్యక్తిగత సమాచారానికి గోప్యత ఉండదిన ఆయన తెలిపారు.. ఫ్యూచర్‌లో దాని వల్ల మీరు సమస్యలు ఎదుర్కొవచ్చని ఆయన పేర్కొన్నారు.

ChatGPTతో ఆ విషయాలను పంచుకుంటున్నారా?.. అయితే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే!
Openai Ceo Sam Altman
Anand T
|

Updated on: Aug 07, 2025 | 4:38 PM

Share

AI సాధనాలు వచ్చిన తర్వాత , కూరగాయలు కొనడం నుండి వైద్య పరీక్షలు చేయించుకోవడం వరకు ప్రతి సమస్యకు ప్రజలు ఏఐను సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతే కాకుండా కొందరు ప్రేమ, తమ భాగస్వాములతో జరిగిన విషయాలు, ఇతర వ్యక్తిగత విషయాలను కూడా ఛాట్‌జీపీటితో పంచుకుంటున్నారు.అయితే ChatGPT వంటి AI సాధనాలతో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మంచిది కాదని Open AI సీఈవో సామ్ ఆల్ట్‌మాస్‌ హెచ్చరించారు. చాట్‌బాట్‌లో ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన అన్నారు. ChatGPTతో జరిగే సంభాషణలు గోప్యతా చట్టాల ద్వారా రక్షించబడవని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ చెప్పుకొచ్చారు.

AI తో మాట్లాడేటప్పుడు మీకు చట్టపరమైన రక్షణ లేదా?

ప్రస్తుతం చాలా మంది యువత తమ కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, కెరీర్ సమస్యలను ChatGPT వంటి AI సాధనాలతో పంచుకుంటారు. కానీ AIతో సంభాషణలకు మీరు డాక్టర్, న్యాయవాది లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడినప్పుడు లభించే చట్టపరమైన రక్షణలు ఉండవని ఆయన అన్నారు. అంటే మీరు ChatGPTతో పంచుకునే సమాచారం దావాలో చట్టపరమైన చర్యకు లోబడి ఉంటుందని సామ్ ఆల్ట్‌మాన్‌ హెచ్చరిస్తున్నారు.

సామ్ ఆల్ట్‌మాన్‌ ఏమి చెబుతాడు?

దిస్ పాస్ట్ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ ఇలా హెచ్చరించాడు, “చాట్‌జిపిడితో చాలా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇప్పుడు ఒక సాధారణ అలవాటుగా మారింది. ప్రజలు, ముఖ్యంగా యువకులు దీనిని తమ స్నేహితుడిగా, జీవిత మార్గదర్శిగా, మానసిక ఆరోగ్య సలహాదారుగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనికి చట్టపరమైన రక్షణ లేదు. దావా వేస్తే, మీరు AIతో చేసే సంభాషణలను కోర్టుకు సమర్పించాల్సి రావచ్చు. ఇది చాలా చెడ్డ పరిస్థితి” అని ఆయన హెచ్చరించారు.

చట్టపరమైన చర్య అవసరం.

అందుకే మనం AI తో పంచుకునే సమాచారం కోసం మానవ సలహాదారుడితో మాట్లాడినప్పుడు మనకు లభించే రక్షణలే మనకు అవసరం, దానిని పరిష్కరించడానికి చట్టం అవసరం పెరుగుతోందని ఆయన అన్నారు. అదనంగా, దీనిని త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది రాజకీయ శాస్త్రవేత్తలు అంగీకరించారని సామ్ ఆల్ట్మాన్ అన్నారు. “మనం త్వరగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.