Foot Odour Remedy: షూస్ వాడకంతో వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేయండి.. ఫలితం ఉంటుంది.
Foot Odour Remedy: షూస్ ధరించేవారు ఎదుర్కొనే సమస్యల్లో దుర్వాసన ఒకటి. రోజతంగా గాలి ఆడకపోవడం, చెమట కారణంగా పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. సాయంత్రం ఇంటికి రాగానే షూలు విప్పితే ఒక్కసారిగా...
Foot Odour Remedy: షూస్ ధరించేవారు ఎదుర్కొనే సమస్యల్లో దుర్వాసన ఒకటి. రోజతంగా గాలి ఆడకపోవడం, చెమట కారణంగా పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. సాయంత్రం ఇంటికి రాగానే షూలు విప్పితే ఒక్కసారిగా దుర్వాసన వస్తుంది. చెమటల వల్ల ఏర్పడే బ్యాక్టీరియానే ఈ దుర్వాసనకు ప్రాధాన కారణం. అయితే కొన్ని నేచురల్ టిప్స్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చే విషయం మీకు తెలుసా? పాదాల నుంచి దుర్వాసన రాకుండా చేయాలంటే పాటించాల్సిన కొన్ని పద్ధతులు..
* షూలు ధరించేప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పాదాలు పొడిగా ఉండడంతో బ్యాక్టీరియా పెరగదు, వెరసి దుర్వాసన రాకుండా ఉంటుంది.
* ఇక షూస్ తీయగానే దుర్వాసన రాకూడదంటే కాళ్లను వెంటనే.. గోరు వెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ కలిపి ఆ నీటిలో 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై బ్యాక్టీరియా వృద్ధ చెందదు.
* పాదాలకు ప్రతి రోజూ నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. ఇలా చేస్తే పాదాల దుర్వాసన సమస్యకు చెక్ పెట్టొచ్చు. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
* పాదాలపై తయారయ్యే బ్యాక్టీరియాను యాపిల్ సైడర్ వెనిగర్ నిరోధిస్తుంది. ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో అర కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా తగ్గడంతో పాటు దుర్వాసన దరిచేరదు.
Drinking Pot Water: కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!