Success Story: ఆవుల పెంపకంతో నెలకు రూ. 10 లక్షల సంపాదన.. కర్ణాటక సివిల్ ఇంజినీర్ విజయ రహస్యమిదే..!
డెయిరీ ఫామ్‌ను నడుపుతున్న హిందర్ మాజీ సివిల్ ఇంజినీర్. అయితే డెయిరీ ఫామ్‌పై ఆసక్తితో అతను ఇంజినీరింగ్ కొలువును విడిచిపెట్టాడు. పాలు, నెయ్యి, ఎరువులు, ఆవులకు స్నానం చేయడానికి ఉపయోగించే నీటిని కూడా అమ్మడం ద్వారా ఆదాయం పొందతున్నారు. పశువుల పెంపకం వంటి నిరాడంబరమైన వృత్తి నుంచి పెద్ద వృత్తిని ఎలా నిర్మించుకోవాలో ? అలాగే డెయిరీ ఫామ్ బిజినెస్‌లో అతను ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో?ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశంలో ఆవును తల్లిగా గౌరవిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో డెయిరీ పరిశ్రమ ఆవుల ఆధారంగానే జరుగుతుంది. అయితే కర్ణాటకు చెందిన జయగురు ఆచార్ హిందర్ అనే యువకుడు ప్రస్తుతం పాడి పరిశ్రమ ద్వారా నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు డెయిరీ ఫామ్‌ను నడుపుతున్న హిందర్ మాజీ సివిల్ ఇంజినీర్. అయితే డెయిరీ ఫామ్‌పై ఆసక్తితో అతను ఇంజినీరింగ్ కొలువును విడిచిపెట్టాడు. పాలు, నెయ్యి, ఎరువులు, ఆవులకు స్నానం చేయడానికి ఉపయోగించే నీటిని కూడా అమ్మడం ద్వారా ఆదాయం పొందతున్నారు. పశువుల పెంపకం వంటి నిరాడంబరమైన వృత్తి నుంచి పెద్ద వృత్తిని ఎలా నిర్మించుకోవాలో ? అలాగే డెయిరీ ఫామ్ బిజినెస్‌లో అతను ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో?ఓ సారి తెలుసుకుందాం.
వివేకానంద కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన తరువాత, హిందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం పనిచేశాడు, నెలకు రూ. 22,000 జీతం వచ్చేది. అయితే 2019లో అతను తన ఉద్యోగాన్ని వదిలి తన కుటుంబానికి చెందిన డెయిరీ వ్యాపారంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. హిండర్ ఎప్పుడూ వ్యవసాయాన్ని ఇష్టపడేవాడు. అలాగే తన పశువులతో ఇంట్లో సరదాగా గడిపాడు. అతను వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి తన సాంకేతిక విద్య, నైపుణ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే డెయిరీని విస్తరించాలని వినూత్న సేల్స్ స్ట్రాటజీలతో ప్రయోగాలు చేసేవాడు.
కొత్త తరహా ఆలోచనలు
నేటి తీవ్రమైన పోటీ వాతావరణంలో మనుగడకు సృజనాత్మకత చాలా అవసరమని హిందర్ అర్థం చేసుకున్నాడు. అయితే అప్పటికే అతని తండ్రికి ఒకేసారి 10 ఆవులు ఉండేవి. హిందర్ వ్యాపారంలో అడుగుపెట్టాక ప్రస్తుం 130 ఆవులు ఉన్నాయి. అదనంగా హిండర్ ఆవు ఎరువును ఎండబెట్టే పరికరాన్ని కొనుగోలు చేశాడు. ఈ యంత్రం ద్వారా ఆవు పేడను ప్రాసెస్ చేసి ప్రతిరోజూ సుమారు 1,000 బస్తాల ఆవు పేడను విక్రయిస్తున్నాడు. హిండర్ ఆవు పేడ, ఆవు మూత్రం, నీటిని కూడా ఉపయోగిస్తాడు, అతను ప్రతిరోజూ దాదాపు 7,000 లీటర్ల పరిమాణంలో విక్రయిస్తాడు. అతను తన ఆవులను స్నానం చేయడానికి ఉపయోగించే నీళ్లతో సహా అతను ఉపయోగించే ప్రతిదీ సద్వినియోగం అయ్యేలా చూసుకుంటాడు.
అలాగే ఓ ఆవు చనిపోయినప్పుడు శరీరాన్ని కొన్ని పదార్థాలతో కలిపి ట్యాంక్‌లో ఉంచుతారు. ఇది చాలా నెలలు నిల్వ చేసి శరీరం పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు మిగిలిన ద్రవానని ద్రవ ఎరువులుగా ఉపయోగిస్తున్నాడు. హిందర్ డెయిరీ ఫామ్ ద్వారా రోజూ 750 లీటర్ల పాలు, 30-40 కిలోల నెయ్యిని విక్రయిస్తున్నాడు.