AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఈ పండ్లను కిలో రూ.1000కు విక్రయం, ఒక ఎకరంలో సాగు చేస్తే 60 లక్షల ఆదాయం..

భారతదేశంలో ప్రస్తుతం లాభాలను ఆర్జిస్తున్న సాగులో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీన్ని సాగు చేయడం ద్వారా రైతులు లక్షల్లో లాభం పొందుతున్నారు. బ్లూబెర్రీ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏటా సాగు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి నాటితే.. 10 సంవత్సరాల పాటు బ్లూబెర్రీస్ పండ్లను ఇస్తూనే ఉంది.  బ్లూబెర్రీస్‌లో అనేక విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిని తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశంలో బ్లూబెర్రీలో అనేక రకాలు ఉన్నాయి.

Business Idea: ఈ పండ్లను కిలో రూ.1000కు విక్రయం, ఒక ఎకరంలో సాగు చేస్తే 60 లక్షల ఆదాయం..
Blueberry Farming
Surya Kala
|

Updated on: Aug 06, 2023 | 8:31 AM

Share

ఇప్పుడు దేశంలో విద్యావంతులైన యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. యువకుల రాకతో వ్యవసాయం చేసే పద్ధతుల్లో కూడా పెను మార్పు వచ్చాయి. యువత సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. దీని వల్ల ఉత్పత్తి పెరిగి ఆదాయం కూడా పెరిగింది. విశేషమేమిటంటే.. వరి, గోధుమల సాగుకు బదులు హార్టికల్చర్ పై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సంప్రదాయ వ్యవసాయానికి..ఆధునిక ఆలోచనలను జోడించి భిన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారు. యువ రైతులు మామిడి, లిచీ, పుట్టగొడుగులు, బెండ, పొట్లకాయ, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ వంటి స్వదేశీ, విదేశీ పండ్లు, కూరగాయలను కూడా పండిస్తున్నారు. వ్యవసాయం ఇప్పుడు వ్యాపారంగా మారడానికి ఇదే కారణం. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఒక గొప్ప ఆలోచనను పరిచయం చేయనున్నాం.. దీనిని వ్యవసాయం చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతారు.

బ్లూబెర్రీ సాగు ప్రారంభిస్తే.. ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. అయితే దేశంలోని అనేక ప్రాంతాల్లో, రైతులు అమెరికన్ బ్లూబెర్రీ సాగును కూడా ప్రారంభించారు. దీంతో ఆ రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్లూబెర్రీ చాలా ఖరీదైన పండు. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.1000కు విక్రయిస్తున్నారు. అమెరికన్ బ్లూబెర్రీస్ సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందిన పండు. అయితే భారతదేశంలో దీని ఉత్పత్తి చాలా తక్కువ. దీంతో ఈ బ్లూబెర్రీస్ ను అమెరికా నుండి భారీగా భారత దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.

10 సంవత్సరాల వరకు బ్లూబెర్రీల ఉత్పత్తి

భారతదేశంలో ప్రస్తుతం లాభాలను ఆర్జిస్తున్న సాగులో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీన్ని సాగు చేయడం ద్వారా రైతులు లక్షల్లో లాభం పొందుతున్నారు. బ్లూబెర్రీ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏటా సాగు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి నాటితే.. 10 సంవత్సరాల పాటు బ్లూబెర్రీస్ పండ్లను ఇస్తూనే ఉంది.  బ్లూబెర్రీస్‌లో అనేక విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిని తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశంలో బ్లూబెర్రీలో అనేక రకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బ్లూబెర్రీస్ అమ్మడం ద్వారా రూ.60 లక్షల వరకు సంపాదన

భారతదేశంలో బ్లూబెర్రీ మొక్కలు పెంపకానికి అనువైన కాలం.. ఏప్రిల్, మే నెలలు. 10 నెలల తర్వాత.. ఈ  మొక్కలు ఉత్పత్తులను ఇవ్వడం మొదలు పెడతాయి. పండ్లను అంటే ఫిబ్రవరి-మార్చి నుండి కోయవచ్చు. ఇలా జూన్ నెల వరకు పండ్ల దిగుబడినిస్తాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత బ్లూబెర్రీ మొక్కలను కత్తిరించాలి.  కత్తిరింపు తర్వాత రెండు మూడు నెలలు అంటే.. సెప్టెంబర్-అక్టోబర్ వరకు మొక్కకు కొమ్మలు రావడం ప్రారంభమవుతాయి. పూత పూయడం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం బ్లూబెర్రీ మొక్కను కత్తిరించడం వల్ల దాని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఒక ఎకరంలో 3000 బ్లూబెర్రీ మొక్కలను నాటవచ్చు. ఒక మొక్క 2 కిలోల వరకు బ్లూబెర్రీ పండ్లు దిగుబడినిస్తాయి. మార్కెట్‌లో బ్లూబెర్రీలను కిలో రూ.1000కు అమ్మవచ్చు. ఈ విధంగా ఒక సంవత్సరంలో 6000 కిలోల బ్లూబెర్రీస్ విక్రయించడం ద్వారా, మీరు 60 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..