Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Tips: డ్రైవింగ్‌లో ఆ తప్పులతో అనుకోని ప్రమాదాలు.. డ్రైవింగ్‌ విషయంలో వయస్సే ప్రామాణికం..!

ముఖ్యంగా యువత వాహనాలను ఎలా వాడాలో? తెలియక గట్టిగా బ్రేక్స్‌ వేయడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారు డ్రైవర్ల విషయానికొస్తే ఇరుకైన రోడ్లలో నావిగేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ట్రాఫిక్‌తో కలవరపడుతూ తప్పులు చేస్తున్నారు. డ్రైవింగ్‌ సమయంలో చిహ్నాల అర్థం ఏమిటో కూడా తెలియదు. ఇతరులు వాటిని గుర్తించలేరు.  కాబట్టి భారతదేశంలో డ్రైవింగ్‌ ఎప్పుడు ప్రారంభించాలి? ఎంత వయస్సు వచ్చాక డ్రైవింగ్‌ నుంచి నిష్క్రమించాలి? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Driving Tips: డ్రైవింగ్‌లో ఆ తప్పులతో అనుకోని ప్రమాదాలు.. డ్రైవింగ్‌ విషయంలో వయస్సే ప్రామాణికం..!
Safe Driving
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 28, 2023 | 9:15 PM

ప్రపంచవ్యాప్తంగా తగ్గతున్నప్రజా రవాణా సౌకర్యాల నేపథ్యంలో ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో వాహన వినియోగం ఎక్కువగా ఉంది. అయితే అవసరం అనేది ఎంత పెద్ద తప్పయినా చేయిస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని మైనర్లు, సీనియర్‌ సిటిజన్లు వాహనాలను నడుపుతూ ఉంటారు. ఇవి పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. ముఖ్యంగా యువత వాహనాలను ఎలా వాడాలో? తెలియక గట్టిగా బ్రేక్స్‌ వేయడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారు డ్రైవర్ల విషయానికొస్తే ఇరుకైన రోడ్లలో నావిగేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ట్రాఫిక్‌తో కలవరపడుతూ తప్పులు చేస్తున్నారు. డ్రైవింగ్‌ సమయంలో చిహ్నాల అర్థం ఏమిటో కూడా తెలియదు. ఇతరులు వాటిని గుర్తించలేరు.  కాబట్టి భారతదేశంలో డ్రైవింగ్‌ ఎప్పుడు ప్రారంభించాలి? ఎంత వయస్సు వచ్చాక డ్రైవింగ్‌ నుంచి నిష్క్రమించాలి? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

మన దేశంలో ప్రారంభించడానికి చట్టపరమైన వయస్సు 18. కానీ దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒక యువకుడు ఇప్పటికీ విద్యార్థి అధిక పనితీరు గల కారు లేదా బైక్‌ను నడపడానికి అనుమతిస్తున్నారా? భారతదేశంలో 200 కేఎంపీహెచ్‌వేగంతో సులభంగా చేరుకోగల కార్లు, బైక్‌లు అమ్మకానికి ఉన్నాయి. అయితే వీటి వాడకంపై అనుముతులు ఉన్నా వాడే సమయంలో పర్యవేక్షణలో వాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాహనం నడపడం అనేది మనకు ఎంత మజాను ఇచ్చినా ఆ వాహనం అదుపు తప్పితే మనతో పాటు బాధితులు అయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలను వాడాల్సి ఉంటుంది. కార్ల విషయానికి వస్తే అందులో ప్రయాణికులను కాపాడేలా అన్ని వ్యవస్థలు ఉంటాయి. అలాగే కార్లల్లో వచ్చే స్క్రీన్‌లు డ్రైవింగ్‌పై దృష్టి మరల్చేలా ఉంటాయి. కాబట్టి డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు శ్రద్ధతో డ్రైవింగ్‌ చేయడం చాలా అవసరం. 

యువ డ్రైవర్లు నిర్లక్ష్యంతో ప్రమాదాన్ని తట్టుకునే స్థాయిలు తక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అతి వేగం అధిక ప్రమాదాలకు కారణం అవుతుంది. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో (జూలై వరకు) నగరంలో 21-30 ఏళ్ల మధ్య వయసున్న వారిపై 3,780 ప్రమాద కేసులు నమోదయ్యాయని, మొత్తం 9,875 మంది బాధితులు ఉన్నారని ఢిల్లీలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. గత ఏడాది మొత్తం ఈ వయస్సులో 5,436 కేసులు, 15,399 మంది బాధితులు ఉన్నారు. దీన్ని బట్టి డ్రైవింగ్‌ ప్రారంభ వయస్సుపై ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యగా కొత్త హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలలో యువ డ్రైవర్లను అనుమతించకూడదని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

అలాగే వృద్ధులు విషయానికి వస్తే శరీరం వయస్సు పెరిగే కొద్దీ డ్రైవింగ్ చేయడం కష్టమైన పనిగా ఉంటుంది. 6 ఏళ్ల వ్యక్తి కంటే 55 ఏళ్ల వ్యక్తి కాంతి నుండి కోలుకోవడానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సమయం పడుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా మన కళ్లతో పాటు వెన్నుముకలు మునుపటిలా లేవు. కానీ కొందరు వృద్ధులు తమ కార్లను నడపడానికి ఇష్టపడతారు. అయితే సీనియర్ సిటిజన్లు తీవ్రమైన అలసట, మందుల వల్ల దుష్ప్రభావాలు, కొన్ని సందర్భాల్లో అభిజ్ఞా క్షీణత, తగ్గిన ప్రతిచర్య సమయం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల సీనియర్‌ సిటిజన్లకు వారి ఆరోగ్యానికి అనుగుణంగా డ్రైవింగ్‌ చేయాలని నిపుణులు వాదన. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం

అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..