Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Insurance: మీ డ్రైవింగ్ స్కిల్స్‌కు టెస్ట్.. మంచి స్కోర్ సాధిస్తే.. రివార్డులే రివార్డులు.. ఓసారి ట్రై చేయండి..

ఓ కంపెనీ ఇన్సురెన్స్ ఇండస్ట్రీలో ఓ కొత్త పద్ధతికి నాంది పలికింది. డ్రైవింగ్ మంచిగా చేసే డ్రైవర్లుంటే ఇన్సురెన్స్ ప్రీమియంలో కొంత శాతం తగ్గింపును అందిస్తుంది. ఇది ఇన్సురెన్స్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ అవుతందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. ఓ యాప్ సాయంతో మీ డ్రైవింగ్ స్కిల్స్ ట్రాక్ చేస్తూ మీ డ్రైవింగ్ పై స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ ఆధారంగా మీకు బీమా ప్రీమియంపై తగ్గింపు లభిస్తుంది.

Car Insurance: మీ డ్రైవింగ్ స్కిల్స్‌కు టెస్ట్.. మంచి స్కోర్ సాధిస్తే.. రివార్డులే రివార్డులు.. ఓసారి ట్రై చేయండి..
Car Insurance
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 6:17 PM

కారు ఇన్సురెన్స్ తీసుకొనే ముందు ఎవరూ డ్రైవింగ్ టెస్ట్ చేయరు. అసలు డ్రైవింగ్ ఉందో లేదో కూడా ఇన్సురెన్స్ కంపెనీలు పట్టించుకోవు. అయితే ఓ కంపెనీ ఇన్సురెన్స్ ఇండస్ట్రీలో ఓ కొత్త పద్ధతికి నాంది పలికింది. డ్రైవింగ్ మంచిగా చేసే డ్రైవర్లుంటే ఇన్సురెన్స్ ప్రీమియంలో కొంత శాతం తగ్గింపును అందిస్తుంది. ఇది ఇన్సురెన్స్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ అవుతందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. ఓ యాప్ సాయంతో మీ డ్రైవింగ్ స్కిల్స్ ట్రాక్ చేస్తూ మీ డ్రైవింగ్ పై స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ ఆధారంగా మీకు కారు బీమా ప్రీమియంపై తగ్గింపు లభిస్తుంది. ఇంతకీ ఎంటా ఆ కంపెనీ? డ్రైవింగ్ టెస్ట్ ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం రండి..

జునో కంపెనీ అందిస్తున్న ఆఫర్..

జునో జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ ఓ పద్ధతిని తీసుకొచ్చింది. దాని పేరు జునో డ్రైవింగ్ కోషెంట్. ఇది జునో మొబైల్ యాప్ సాయంతో పనిచేస్తుంది. ఈ యాప్ మీ మొబైల్ లోని సెన్సార్ సాయం తీసుకొని టెలిమాటిక్స్ ద్వారా మీరు డ్రైవ్ చేస్తున్న కారును పర్యేవేక్షిస్తుంది. కారు వేగం, నియంత్రణ, బ్రేకుల వినియోగం, టర్నింగ్ల వద్ద కారును డ్రైవ్ చేస్తున్నారు అనే విషయాలను అధ్యయనం చేస్తుంది. సడన్ బ్రేకులు వేస్తున్నారా? డ్రైవింగ్ గందరగోళంగా ఉందా, పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నారా వంటి అనేక అంశాలను క్రోడీకరించి మీ డ్రైవింగ్ కు స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా మీకు కారు ఇన్సురెన్స్ పై రాయితీని అందిస్తుంది.

డ్రైవింగ్లో స్టార్ అయితే.. ప్రీమియం తగ్గింపు..

మీ కారులో మీరైనా, మీ డ్రైవరైనా మంచిగా డ్రైవింగ్ చేసి, జునో యాప్ లో మంచి స్కోర్ సాధిస్తే మీరు బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం కూడా తగ్గుతుంది. జునో డ్రైవింగ్ కోషెంట్ స్కోర్ 85 నుంచి 90శాతం నమోదైతే మీ కారు సొంత డ్యామేజ్ కారు ఇన్సురెన్స్ కు సంబంధించిన ప్రీమియంలో 10 నుంచి 20శాతం వరకూ ఆదా అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జునో జనరల్ ఇన్సురెన్స్ ఎండీ అండ్ సీఈఓ శనాయ్ ఘోష్ మాట్లాడుతూ ఈ డిస్కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదెలా అంటే మీరు ఒకవేళ మారుతి సుజుకీకి చెందిన సెడాన్ కారు స్విఫ్ట్ డిజైర్ 2017 మోడల్ కారు నడుపుతున్నట్లు అయితే మీకు జునో యాప్ లో డ్రైవింగ్ కోషెంట్ స్కోర్ 92శాతం వచ్చిందనుకుంటే మీకు అదనంగా 5శాతం ప్రీమియం ఆదా అవుతుందని చెప్పారు. అంటే సాధారణంగా 10 నుంచి 20శాతం అనుకుంటే దీనికి అదనంగా ఐదు శాతం కలిసి 25శాతం ఆదా అవుతుందని వివరించారు. అదే విధంగా జునో డ్రైవింగ్ కోషెంట్ 96 శాతం కన్నా ఎక్కువ నమోదైతే అదనంగా 6 శాతం ఆదా చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

టెస్ట్ చేసుకోండి..

చాలా మంది తమకు తాము మంచి డ్రైవర్లమనీ చెప్పుకుంటూ ఉంటారు. వారికి తమని తాము నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం. మంచిగా డ్రైవ్ చేసుకోండి.. తక్కువ ప్రీమియంతో ఇన్సురెన్స్ పాలసీ తీసుకొనే అవకాశాన్ని గెలుచుకోండి. వెంటనే జునో జనరల్ ఇన్సురెన్స్ గురించి కంపెనీని సంప్రదించండి. ఇది మీకు ఎలాంటి టూల్స్ లేకుండానే.. కేవలం మొబైల్ యాప్ సాయంతోనే డ్రైవింగ్ ను ట్రాక్ చేయడంతో పాటు మంచి డ్రైవర్లకు రివార్డులు కూడా ఇస్తారు. ఓ సారి ప్రయత్నించి చూడండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..