AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Driving Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ తప్పు చేస్తున్నారా.. అసలు విషయం తెలుసుకోండి..

Car Driving In Slippers: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెప్పు, స్లిప్పర్లు, షూస్ వేసుకుని డ్రైవ్ చేస్తే మంచిదా.. లేకా వేసుకుకున్నా నడపవచ్చా.. ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఇలాంటివి ఎవరినైనా అడిగితే బాగుంటుందా.. ఏమనుకుంటారో అని పక్కన పెట్టేస్తుంటాం. తప్పుకుండా డ్రైవింగ్ సమయంలో షూ ధరించి డ్రైవింగ్ చేయాలనే చట్టం ఏమైన ఉందా.. ఇలాంటి చాలా ప్రశ్నలకు మనం ఇక్కడ జవాబులను తెలుసుకుందాం..

Car Driving Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ తప్పు చేస్తున్నారా.. అసలు విషయం తెలుసుకోండి..
Car Driving In Slippers
Sanjay Kasula
|

Updated on: Sep 23, 2023 | 3:23 PM

Share

కారు డ్రైవింగ్ చేయాలని.. కారులో షికారు చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.. మనలో చాలా మంది డ్రైవింగ్ ఇప్పటికే నేర్చుకుని లాంగ్ డ్రైవ్ చేస్తున్నవారు ఉంటారు.. కొత్తగా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉండేవారి సంఖ్య కూడా ఉంటుంది. వీరు ఏదైన ఓ డ్రైవింగ్ స్కూల్‌లో చేరి నేర్చుకుంటారు. ఆ డ్రైవింగ్ స్కూల్ వారు స్టీరింగ్ పట్టుకోవడం మొదలై.. రహదారుల్లో ఎలా డ్రైవ్ చేయాలి.. రద్దిగా ఉండే చోట ఎలా నడపాలో కూడా చాలా స్పష్టంగా నేర్పిస్తారు. అయితే, ఇక్కడే మనకు ఓ డౌట్ అలానే ఉండిపోతుంది.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెప్పు, స్లిప్పర్లు, షూస్ వేసుకుని డ్రైవ్ చేస్తే మంచిదా.. లేకా వేసుకుకున్నా నడపవచ్చా.. ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఇలాంటివి ఎవరినైనా అడిగితే బాగుంటుందా.. ఏమనుకుంటారో అని పక్కన పెట్టేస్తుంటాం. తప్పుకుండా డ్రైవింగ్ సమయంలో షూ ధరించి డ్రైవింగ్ చేయాలనే చట్టం ఏమైన ఉందా.. ఇలాంటి చాలా ప్రశ్నలకు మనం ఇక్కడ జవాబులను తెలుసుకుందాం..

ముందుగా మనం తెలుసుకోవల్సింది ఏంటంటే.. భారతదేశంలో చెప్పులు ధరించి కారు నడపడంపై ఎటువంటి చట్టం లేదు. అలా అని, చెప్పులు వేసుకుని కారు నడపాలని దీని అర్థం కాదు. వాస్తవానికి, చెప్పులు ధరించి కారు నడపడం కొంత ప్రమాదకరం అని డ్రైవింగ్ నిపుణులు సూచిస్తుంటారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. చెప్పులు ధరించి కారు నడపడం మానుకోవాలని సూచిస్తారు. మొదటి విషయం ఏంటంటే, చెప్పులు పెడల్ను సరిగ్గా పట్టుకోలేవు.

ఇవి కూడా చదవండి

పెడల్స్‌పై సరైన పట్టు కోసం

బ్రేక్, క్లచ్ లేదా యాక్సిలరేటర్ పెడల్‌పై కాలు జారిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు సడన్‌గా బ్రేకులు వేయడానికి ప్రయత్నించి, మీ స్లిప్పర్ పెడల్‌పై జారిపోతే.. కారు అదుపు తప్పి ప్రమాదానికి దారితీయవచ్చు.

చెప్పులు పెడల్స్‌లో ఇరుక్కుపోయే ప్రమాదం

దీంతో పాటు చెప్పులు పెడల్స్‌లో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. మీరు మీ కుడి పాదాన్ని యాక్సిలరేటర్ పెడల్ నుంచి బ్రేక్‌కి లేదా బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలరేటర్ పెడల్‌కి మార్చినప్పుడు.. చాలా సార్లు చెప్పులు వాటిలో ఇరుక్కుపోతాయి. ఇలా ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఏం చేయాలి?

చెప్పులు ధరించి కారు నడపడం ముందుగా మానుకోవాలి. చెప్పలు, స్లిప్పర్లు ధరించిన తర్వాత ఏం చేస్తారు అంటే.. చెప్పులు అక్కడే వదిలి బెడల్స్‌పై నొక్కుతున్నప్పుడు చెప్పులు ముందుకు వచ్చేస్తుంటాయి. చెప్పులు బ్రేక్ కిందికి వస్తే.. బ్రేకులు సరిగ్గా రాదు.. ఇలా జరిగిన ప్రమాదాలు చాలా ఉంటాయి. కారు నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ బూట్లు ధరించండి.. ఇది చాలా సురక్షితం.  బూట్లు పెడల్స్‌పై మంచి పట్టును అందిస్తాయి. పాదాలు సురక్షితమైన స్థితిలో ఉంటాయి. మీరు బూట్లు ధరించకపోతే కారు నడపడం మానుకోండి. మీరు చెప్పులు ధరించి కారు నడపడం మానుకోవడం ద్వారా మీ, ఇతరుల భద్రతను నిర్ధారించుకోవచ్చు.

మరన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?