AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alluri Sitaramaraju: బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ‘అల్లూరి సీతారామారాజు’

Alluri Sitaramaraju: భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామారాజు ఒక మహోన్నతమైన శక్తి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. మన్యం వీరుడు..

Alluri Sitaramaraju: బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన 'అల్లూరి సీతారామారాజు'
Alluri Sita Rama Raju
Subhash Goud
|

Updated on: Jul 03, 2022 | 10:22 AM

Share

Alluri Sitaramaraju: భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామారాజు ఒక మహోన్నతమైన శక్తి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామారాజు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడు. రెండు సంవత్సరాల పాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి. జూలై 4 అల్లూరి జయంతి.

అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన వ్యక్తి. దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్‌ సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నారు.

అల్లూరి 1897 జూలై 4వ తేదీన పాండ్రంగి గ్రామంలో వెంటక రామరాజు – సూర్యనారాయణమ్మలకు జన్మించారు. అల్లూరి పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో. 9వ తరగతి వరకూ చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం విలువిద్య, గుర్రపుస్వారీలో మంచి ప్రావీణ్యం కలిగిన వీరుడు.

ఇవి కూడా చదవండి

1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మొదటిసారిగా దాడి చేశారు. 23న కృష్ణదేవీపేట పోలీస్‌స్టేషన్‌, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ మూడు పోలీస్‌ స్టేషన్‌లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకుని విప్లవం ప్రారంభించారు. ఆ నాటి నుంచి వసరుగా పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్‌ అధికారుల గుండెల్లో దడ పుట్టించారు అల్లూరి. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యంలో అల్లూరి సీతారామారాజు అనుచరులను చంపేసింది.

ఇక బ్రిటిష్‌ సర్కార్‌ మన్యం ప్రజలను చంపేయడం మొదలు పెట్టింది. ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్న తీరును చూడలేక అల్లూరి సీతారామారాజు త్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7వ తేదీన విశాఖ జిల్లా మంప గ్రామానికి దగ్గరలో రాజు స్వయంగా లొంగిపోయారు. ఇక పగతో రగిలిపోతున్న బ్రిటిష్‌ అధికారులు అల్లూరిని చింతచెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. మే 8వ తేదీన అల్లూరి అనుచరులు ఆయన భౌతికకాయన్ని కృష్ణదేవీపేటకు తీసుకువచ్చి దహన క్రియలు నిర్వహించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి