Viral News: బాలుడి చెంపపై బల్లి ముద్ర.. అసలు ఎలా వచ్చిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.!
Little Boy Falls Asleep On A Dead Lizard: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ప్రపంచం నలుమూలల..
Little Boy Falls Asleep On A Dead Lizard: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ప్రపంచం నలుమూలల ఏ విషయం జరిగినా కూడా ఇట్టే తెలిసిపోతోంది. చిత్ర విచిత్రమైన ఫోటోలు అయితే.. మాత్రం స్పీడ్‌గా విస్తరిస్తుంటాయి. ఇక అలాంటి పిక్ ఒకదాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం.. (Trending In Social Media)
ఓ బాలుడి చెంపపై బల్లి ముద్ర ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బల్లి ముద్ర ఎలా వచ్చింది. అసలేం జరిగింది.? అనే విషయాలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చివరికి అసలు విషయం తెలిసిన తర్వాత జనం అందరూ విపరీతంగా నవ్వుకున్నారు. ఈ ఘటన చైనా(China) దేశంలో చోటు చేసుకుంది. ఆ మ్యాటర్ ఏంటంటే… (Viral News Latest)
స్కూల్ పిల్లలకు ఇష్టం లేనిది ఏదైనా ఉందంటే.. అది హోంవర్క్.. బుక్ ఓపెన్ చేస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ బాలుడు హోంవర్క్ చేసుకుంటూ.. అమాంతం బుక్‌పైనే నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం నిద్ర నుంచి లేచిన ఆ బాలుడికి చెంపపై ఏదో ఉన్నట్లు అనిపించింది. అద్దంలో చెంపపై ఉన్న బల్లి ముద్రను చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఈ ముద్ర ఎలా వచ్చిందా.? అని తన బుక్‌ను చూసుకున్న బాలుడికి అక్కడ చచ్చిపోయిన బల్లి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటో జాక్సన్ లూ అనే నెటిజన్ ట్వీట్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Little Boy Falls Asleep On A Dead Lizard
మరిన్ని ఇక్కడ చదవండి:
కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
你寫作業打瞌睡還沒關係,你連睡在死壁虎上都沒有感覺是嗎? ????? pic.twitter.com/DUhRkhLdUJ
— jackson Lu (@menlin_fitri) February 21, 2021