AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన 58 సంవత్సరాలకు హైకోర్టు మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. ఎందుకో తెలుసా..?

రాజస్థాన్ చోటు చేసుకున్న ఒక షాకింగ్ కేసు బయటపడింది. 58 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత ఒక జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే రాజస్థాన్ హైకోర్టు వృద్ధ దంపతుల అప్పీల్‌ను మన్నించడానికి నిరాకరించింది. చిన్న వాదనలు, విభేదాలను క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది.

పెళ్లైన 58 సంవత్సరాలకు హైకోర్టు మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. ఎందుకో తెలుసా..?
Elder Couple Divorce
Balaraju Goud
|

Updated on: Feb 15, 2026 | 5:28 PM

Share

రాజస్థాన్ చోటు చేసుకున్న ఒక షాకింగ్ కేసు బయటపడింది. 58 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత ఒక జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే రాజస్థాన్ హైకోర్టు వృద్ధ దంపతుల అప్పీల్‌ను మన్నించడానికి నిరాకరించింది. చిన్న వాదనలు, విభేదాలను క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. భరత్‌పూర్ ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సుదేష్ బన్సాల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్, “విడాకులు ఇవ్వడం వల్ల భార్యకే కాకుండా మొత్తం కుటుంబానికి బాధ కలుగుతుంది. వారి గౌరవం ప్రమాదంలో పడుతుంది” అని పేర్కొంది.

అసలు ఏం జరిగింది..?

ఈ జంట జూన్ 29, 1967న వివాహం చేసుకున్నారు. 2013 వరకు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా 46 సంవత్సరాలు కలిసి జీవించారు. మే 26, 2014న తమకు విడాకుల మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. తన భార్య వరకట్న వేధింపులను ఆరోపిస్తూ.. 2014లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని, ఇది కల్పితమని పోలీసులు భావించి, తనను అవమానించారని భర్త పేర్కొన్నాడు. తన భార్య తన పెద్ద కొడుకుకు ఆస్తిని బదిలీ చేయాలనుకుంటుందని, ఆ ఆస్తిని తన ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాలని కోరుకుంటున్నానని, ఆమె తనను నిర్లక్ష్యం చేసిందని, తనకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య వాదన

తన భర్త కుటుంబ ఆస్తిని దుర్వినియోగం చేసి పంచుతున్నాడని, తన తమ్ముడి ఒత్తిడితో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని భార్య పేర్కొంది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని, మరొక మహిళను తన గదిలోకి ఆహ్వానించాడని, దీని ఫలితంగా గొడవ జరిగిందని, అంతేకాకుండా తనపై కేసు పెట్టారని వృద్ధ మహిళ ఆరోపించింది. ఆ ఆస్తిని తానే కొనుగోలు చేశానని కూడా ఆమె పేర్కొంది.

కోర్టు ఏం చెప్పింది?

దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత, వారి మానసిక సహనం, అవగాహన పెరిగిందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆస్తి వివాదాలు కుటుంబ సమస్యలకు కారణమవుతాయని తెలిపింది. కానీ అవి విడాకులకు తగిన కారణాలు కాదని హైకోర్టు అంగీకరించింది. ఈ వయసులో విడాకులు ఇవ్వడం వల్ల భార్యకే కాకుండా మొత్తం కుటుంబానికి బాధ కలుగుతుంది. వారి గౌరవం దెబ్బతింటుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..