AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zoonosis Diseases: ఆ వ్యాధులకు అదే కారణం.. అప్రమత్తం కాకపోతే మరణమే.! వివరాలు ఇవే!

Zoonosis: రోజురోజుకు వివిధ రకాల వైరస్‌లు వెంటాడుతున్నాయి. గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడు బయట పడుతుంటే.. కొత్త కొత్త వేరియంట్లు వచ్చి ఇబ్బందులకు..

Zoonosis Diseases: ఆ వ్యాధులకు అదే కారణం.. అప్రమత్తం కాకపోతే మరణమే.! వివరాలు ఇవే!
Zoonosis Diseases
Subhash Goud
|

Updated on: Jun 01, 2022 | 8:31 PM

Share

Zoonosis: రోజురోజుకు వివిధ రకాల వైరస్‌లు వెంటాడుతున్నాయి. గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడు బయట పడుతుంటే.. కొత్త కొత్త వేరియంట్లు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా మంకీపాక్స్‌ వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. ఇతర దేశాల్లో ఈ వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్‌ల భయాందోళన ఇంకా తగ్గలేదు. ఇక జూనోసిస్‌ వ్యాధుల (Zoonosis Diseases)లో ఒకదానికొకటి తగ్గుముఖం పట్టినట్లే పట్టి మంకీపాక్స్‌ కూడా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం. మంకీపాక్స్‌ అనేది వైరస్‌ వల్ల కలిగే జునోసిస్‌ వ్యాధి. మశూచి నిర్మూలన తర్వాత అత్యంత ముఖ్యమైన ఆర్థోపాక్స్‌ వైరస్‌ సంక్రమణగా గుర్తించబడింది. అయితే జూనోసిస్‌ల వల్ల ప్రపంచాన్ని అప్రమత్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఎబోలా, సార్స్, మెర్స్, హెచ్‌ఐవి, లైమ్ డిసీజ్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, లస్సా ఫీవర్‌లకు మందులు అందుబాటులోకి వచ్చాయి.

జూనోసిస్ అనేది జంతువుల నుండి మానవులకు (లేదా మానవుల నుండి జంతువులకు) జాతుల మధ్య సంక్రమించే ఒక అంటు వ్యాధి. అంటు వ్యాధులలో అరవై శాతం, అభివృద్ధి చెందుతున్న అంటు వ్యాధులలో 75 శాతం జూనోటిస్‌గా ఉన్నాయి. భారతదేశంలో ఇంటర్నేషనల్ లైవ్‌స్టాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం.. ఈ అంటు వ్యాధుల బారిన 2.4 బిలియన్‌ మంది ఉండగా, ఏడాదికి 2.2 మిలియన్ల మరణాలు సంభవించాయి. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టెంట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డాక్టర్ నేహా రస్తోగి పాండా జూనోటిక్ వ్యాధి బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాల వల్ల సంభవిస్తుందని, జంతువుల ద్వారా మనుషులకు సంక్రమిస్తుందని వివరించారు. జూనోటిస్‌ వ్యాధులలో ఇటీవల కోవిడ్‌ వ్యూహన్‌లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని ఉదాహరణగా చెప్పారు.

జూనోసిస్ అనేది జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులు. వ్యాధికారక కారకాలు బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు కూడా కావచ్చు. ఈ వ్యాధుల ప్రసారం ప్రత్యక్షంగా, జంతువు, మానవుని మధ్య సంపర్కం సమయంలో లేదా పరోక్షంగా ఆహారం ద్వారా లేదా పర్యావరణం ద్వారా సంభవిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిని బట్టి వాటి తీవ్రత, లక్షణాలు చాలా మారుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జూనోసిస్ అంటే ఏమిటి?

జూనోసిస్ అనే పదం గ్రీకు పదాల నుండి వచ్చింది. జూనోసిస్‌ అంటే ‘జంతువు-వ్యాధి’ అని అర్థం. జూనోసిస్ అనేది కుక్క, ఆవు, కోడి, పంది వంటి జంతువు నుండి మానవులకు వ్యాపించే వ్యాధి. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రకారం.. దాదాపు 60శాతం మానవ అంటు వ్యాధులు జూనోటిక్‌గా ఉంటాయి. ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్ది కేసులు, మరణాలకు జూనోసిస్‌ కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు. జూనోస్‌లలో 200కి పైగా రకాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి