Women Health: పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువగా ఉన్నాయా? ఇదే కారణం అయి ఉండొచ్చు?

నేటి కాలంలో మహిళలు పీరియడ్స్‌కు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పీరియడ్స్ సకాలంలో రాకపోవడం, అధిక రక్తస్రావం, రుతుక్రమం ఎక్కువైపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సాధారణంగా, మహిళల్లో పీరియడ్స్ మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటాయి. కొంతమంది స్త్రీలలో ఇవి ఏడు రోజులు కూడా ఉంటాయి. కానీ ఇది 7 రోజుల కంటే ఎక్కువ కొనసాగితే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది రెండు నుండి నాలుగు నెలలకు ఒకసారి జరగవచ్చు. కానీ ఈ సమస్య ప్రతి నెలా జరుగుతుంటే..

Women Health: పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువగా ఉన్నాయా? ఇదే కారణం అయి ఉండొచ్చు?
Periods
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 14, 2023 | 5:41 AM

నేటి కాలంలో మహిళలు పీరియడ్స్‌కు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పీరియడ్స్ సకాలంలో రాకపోవడం, అధిక రక్తస్రావం, రుతుక్రమం ఎక్కువైపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సాధారణంగా, మహిళల్లో పీరియడ్స్ మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటాయి. కొంతమంది స్త్రీలలో ఇవి ఏడు రోజులు కూడా ఉంటాయి. కానీ ఇది 7 రోజుల కంటే ఎక్కువ కొనసాగితే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది రెండు నుండి నాలుగు నెలలకు ఒకసారి జరగవచ్చు. కానీ ఈ సమస్య ప్రతి నెలా జరుగుతుంటే.. అప్పుడు మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఈ కాలంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటే.. అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. అయితే అవి ఇంత కంటే ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీ పీరియడ్స్ ఐదు రోజుల్లో ముగిసిపోయి ఇప్పుడు ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే. ఇలాగే ప్రతి నెలా జరుగుతుంటే.. ఈ సమస్యపై తప్పకుండా దృష్టి పెట్టాలి. ఇది ఆందోళనకరమైన సంకేతం కావచ్చు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత సరిగా లేదని ఇది సూచిస్తుంది. ఇది తరువాత అనేక వ్యాధులకు కారణం కావచ్చు.

రక్తస్రావం డిసీజ్..

ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంచల్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి నెలా 7 రోజుల కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ కొనసాగుతూ ఉంటే, అది అనేక వ్యాధులకు సంకేతంగా ఉంటుంది. ఈ సమయంలో అధిక రక్తస్రావం ఉంటే.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలో ఏదైనా రక్తస్రావం రుగ్మత కనిపిస్తే.. చికిత్స చేయించుకోవాలి. ఈ వ్యాధులను మందుల ద్వారా సులభంగా నయం చేయవచ్చు. బ్లీడింగ్ డిజార్డర్ లేకపోతే.. ఎక్కువ కాలం పీరియడ్స్ ఈ మూడు వ్యాధులకు సంకేతం. అవేంటంటే..

ఫైబ్రాయిడ్

ఏడు రోజుల కంటే ఎక్కువ పీరియడ్స్ ఉండటం గర్భాశయంలో ఫైబ్రాయిడ్లకు (గడ్డలు) సంకేతం. గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్లు తర్వాత తీవ్రమైన సమస్యగా మారతాయి. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

థైరాయిడ్

కొంతమంది స్త్రీలలో, థైరాయిడ్ వ్యాధి కారణంగా కూడా పీరియడ్స్ ఎక్కువ కాలం ఉంటుంది. ఈ సమస్య కొనసాగితే.. థైరాయిడ్‌ను కూడా టెస్ట్ చేసుకోవాలి.

గర్భాశయ క్యాన్సర్

ఫైబ్రాయిడ్స్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా కడుపు దిగువ భాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో పీరియడ్స్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. 45 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

పీరియడ్స్ ఏడు రోజులకు మించి జరుగుతూ ఉంటే వెంటనే వైద్యులకు చూయించుకోవాలి..

పీరియడ్స్ సమయంలో డైట్, లైఫ్ స్టైల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి

పొత్తి కడుపులో నొప్పిని తేలికగా తీసుకోకండి

అధిక రక్తస్రావం జరిగినా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..