AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టీ తాగితే రోజంతా ఎనర్జీ ఉంటుంది.. నీరసం అనేది ఉండదు..!

ప్రతి రోజు ఉదయం చాలా మంది టీ తాగడం ద్వారా రోజంతా శక్తిగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందులో వాడే తీపి పదార్థం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా పంచదార వాడటం ఓ అలవాటుగా మారింది. కానీ బెల్లం ఉపయోగిస్తే దాని రుచి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటాయి.

ఈ టీ తాగితే రోజంతా ఎనర్జీ ఉంటుంది.. నీరసం అనేది ఉండదు..!
Jaggery Tea
Prashanthi V
|

Updated on: May 08, 2025 | 4:56 PM

Share

బెల్లం వాడి టీ తయారు చేస్తే మృదువైన తీపితో పాటు ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది. ఇది సహజమైన తీపి కావడం వల్ల శరీరానికి హానికరం కాని విధంగా పని చేస్తుంది. రసాయన పదార్థాలు లేకుండా తయారయ్యే బెల్లం శరీరానికి మంచిదిగా పరిగణించబడుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు బాగా లభ్యమవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయే హానికర రసాయనాల నష్టం ను ఎదుర్కొని ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. శరీరం బలపడటానికి ఇవి అవసరం. చలికాలం లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు రోగనిరోధకతను పెంచటానికి బెల్లం టీ దోహదపడుతుంది.

ఇంకా ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. బెల్లం రెగ్యులర్‌ గా తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుంది. ఇది ముఖ్యంగా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. అనేమియా వంటి సమస్యల నివారణకు సహజ మార్గంగా ఈ టీని చూసుకోవచ్చు.

జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు బెల్లం ఉపశమనం ఇస్తుంది. ఇది జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచి ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు దోహదం చేస్తుంది. బెల్లం టీ తాగినప్పుడు అజీర్ణం, బ్లోటింగ్ వంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.

పంచదార తీపి వేగంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ బెల్లం తీపి మెల్లగా విడుదలవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహ బాధితులు కూడా దీనిని పరిమితంగా తాగవచ్చు. శక్తి స్థాయిని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.

బెల్లంలో ఉండే వేడి చేసే గుణాల వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో బెల్లం టీ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. సహజంగా వేడిని పెంచే లక్షణం ఉండడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగడానికి బెల్లం టీ చాలా మంచిది. ఇలా బెల్లంతో చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు