AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే షుగర్ ఇక మీ జోలికి రాదు.. కంట్రోల్‌ లో ఉంటుంది..!

రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం మధుమేహ బాధితులకు ఎంతో ముఖ్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు కనిపించొచ్చు. శరీరానికి పోషకాలు అందించడంతోపాటు చక్కెరను నియంత్రించే గుణాలు కలిగిన కొన్ని సూపర్ ఫుడ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే షుగర్ ఇక మీ జోలికి రాదు.. కంట్రోల్‌ లో ఉంటుంది..!
Diabetes
Prashanthi V
|

Updated on: May 08, 2025 | 4:51 PM

Share

పసుపు.. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచే సహజ ఔషధంగా పురాతన కాలం నుంచి ఉపయోగంలో ఉంది. ఇందులో ఉండే ముఖ్యమైన కర్క్యూమిన్ పదార్థం శరీర ఇన్సులిన్ వినియోగాన్ని పెంచేలా పని చేస్తుంది. దీన్ని తేనెతో కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయి సమతుల్యంలోకి వచ్చేందుకు సహకరిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడమే కాకుండా.. షుగర్ నియంత్రణలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి రసం లేదా తాజా ఉసిరికాయ మధుమేహ నియంత్రణకు మంచి సహాయకారిగా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

దాల్చిన చెక్క ఆహారంలో ఉపయోగించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పని చేస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల శరీరానికి ఇన్సులిన్‌ను మెరుగైన రీతిలో ఉపయోగించుకునే సామర్థ్యం కలుగుతుంది. టీ లేదా గోరు వెచ్చని నీటితో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

బ్రొకోలీ, క్యాబేజీ వంటి కూరగాయలు విటమిన్ సి, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. గ్లూకోజ్‌ను శరీరంలో శక్తిగా మార్చే ప్రక్రియను మెరుగుపరచడంలో ఈ పదార్థాలు పాత్ర పోషిస్తాయి. ఇవి తరచూ భోజనంలో చేర్చడం ద్వారా చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి.

యాపిల్‌లో ఉండే ఫైబర్ వల్ల తీసుకున్న ఆహారం రక్తప్రవాహంలోకి చక్కెరగా త్వరగా మారకుండా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజూ ఒక యాపిల్ తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

బాదం, వాల్ నట్స్, చియా గింజలు.. ఈ డ్రైఫ్రూట్లు శరీరానికి శక్తిని అందిస్తూ.. ఒక్కసారిగా షుగర్ పెరగకుండా నియంత్రణలో ఉంచేందుకు దోహదపడతాయి. ఇవి ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. చిన్న పరిమాణంలో రోజు తీసుకోవచ్చు.

పొటాషియం, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండే ఈ పదార్థాలు షుగర్‌ను తగ్గించడంలో సహకరిస్తాయి. నారింజ, ముల్లంగి, క్యారెట్ లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం వల్ల మధుమేహ లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ పదార్థాలను రోజూ సరైన మోతాదులో తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ ఈ సూపర్ ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు