AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు మొదట ఏం చేయాలి? ప్రాణాలను కాపాడే చిట్కాలివే..

గుండెపోటు రాకుండా ఉండేందుకు మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు మొదట ఏం చేయాలి? ప్రాణాలను కాపాడే చిట్కాలివే..
Heart Attack
Basha Shek
|

Updated on: Oct 08, 2022 | 9:30 AM

Share

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా ఈరోజుల్లో వృద్ధులే కాదు యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు . చాలా మంది ఈ ప్రమాదకరమైన గుండె జబ్బులతో బాధపడుతుండటం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు రాకుండా ఉండేందుకు మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మానసిక ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. అలాగే ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు మొదట ఏమి చేయాలి? ప్రాథమిక చికిత్సలో భాగంగా అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

గుండెపోటు వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలంటే..

  • ఎవరైనా గుండెపోటుకు గురైతే, భయపడకుండా వారికి జాగ్రత్త చెప్పడం మొదటి కర్తవ్యం.
  • గుండెపోటు విషయంలో రోగిని ముందుగా పడుకోబెట్టి సుఖంగా ఉంచాలి. ఆస్పిరిన్ టాబ్లెట్ రోగికి వీలైనంత త్వరగా ఇవ్వాలి. ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. దీని వల్ల మరణాలను 15 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • గుండెపోటుకు గురైన సమయంలో హృదయ స్పందన మందగించవచ్చు లేదా ఆగిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే ఛాతీపై నొక్కి బాధితుడు శ్వాస తీసుకునేలా ప్రయత్నించాలి. దీనిని సీపీఆర్‌ టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్‌ కారణంగానే ఇటీవల చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి.
  • అప్పటికీ రోగి కోలుకోకపోతే కృత్రిమ శ్వాస అందించాలి. ముక్కు, నోటి ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నించాలి. ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఈ సమయంలో బాధితుడి నోటి నుంచి గాలి గాలి ఏ విధంగానూ బయటకు రాకుండా జాగ్రత్త వహించండి.
  • గుండెపోటు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్ ఎటాక్ పేషెంట్ ఎక్కువ సమయం వృథా చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

గుండె ఆరోగ్యం కోసం ఇలా చేయండి

  • జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోండి. మద్యపానం, ధూమపానానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పండి.
  • బిజీ లైఫ్ వల్ల మనసు, శరీరం రెండూ అలసిపోతున్నాయి. కాబట్టి 20 నిమిషాల వ్యాయామం, యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.
  • మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, తక్కువ చక్కెర తినండి. ఉప్పు, పంచదార వల్ల అనేక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇవి రక్తపోటు ప్రమాదాన్ని పెంచి తీవ్రమైన గుండెజబ్బులకు దారితీస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి