Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Rice: అన్నం సంప్రదాయ పద్ధతుల్లో వండుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. బియ్యం ఎలా వండితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి!

ఉత్తర భారతీయులు రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తినడానికి ఇష్టపడతారు. అదే దక్షిణ భారత ప్రజలకు బియ్యంతోనే రోజంతా ఆహారం నడుస్తుంది.

Cooking Rice: అన్నం సంప్రదాయ పద్ధతుల్లో వండుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. బియ్యం ఎలా వండితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి!
Cooking Rice
Follow us
KVD Varma

|

Updated on: Dec 05, 2021 | 8:14 PM

Cooking Rice: ఉత్తర భారతీయులు రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తినడానికి ఇష్టపడతారు. అదే దక్షిణ భారత ప్రజలకు బియ్యంతోనే రోజంతా ఆహారం నడుస్తుంది. ఏదైనా అనారోగ్య కారణాలు.. డైటింగ్ వంటి అవసరాలు ఉన్నవారు తప్ప దక్షిణాదిన రెండు పూటలా అన్నం తినడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇక బియ్యంతో అన్నం ఒకటే కాకుండా చాలా వంటకాలు దక్షిణాదిన చేస్తారు. ఇవి తినడానికి చాలా బాగుంటాయి. ఒక్కసారి తింటే ఇంకోసారి తినాలనిపించేలా ఉంటాయి ఈ వంటకాలు. అయితే, భారతీయ వంటకాల్లో అన్నం అంతర్భాగం. మనలో చాలా మంది దీనిని సాంప్రదాయ పద్ధతిలో స్టీమింగ్ చేసి బాయిల్ పద్ధతిలో సిద్ధం చేసినప్పటికీ, ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగించడం ఎక్కువ అయింది.

అన్నం వండటానికి సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే ప్రెజర్ కుక్కర్ లో తక్కువ సమయం తీసుకుంటుంది. అంతే కాకుండా సంప్రదాయ పద్ధతిలో అన్నం వండాలంటే పని కూడా ఎక్కువగానే ఉంటుంది. కుక్కర్ లో అన్నం వండటానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. ఈ కారణంగా ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు ఏ రకంగా బియ్యాన్ని వండితే మంచిదో మీకు తెలుసా? కుక్కర్ లో వండిన అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? సంప్రదాయ బద్ధంగా వండిన బియ్యం మంచిదా? ఈ విషయాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

1. ప్రెజర్ తో వండిన అన్నం Vs ఉడికించిన అన్నం

ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం దాని ఆకృతి కారణంగా బాగా రుచిగా ఉంటుంది కానీ, సాంప్రదాయక అభిప్రాయం ప్రకారం ఆవిరితో ఉడికించిన అన్నం ఆరోగ్యకరమైనదని చెబుతారు. ఇలా వండిన అన్నం తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. అయితే, ఈ పద్ధతిలో ఇది పిండిపదార్థాన్ని తొలగిస్తుంది. ఇది బరువు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. స్టార్చ్‌తో పాటు కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు వంటి నీటిలో కరిగే పోషకాలు కూడా సంప్రదాయంగా చేసే వంట వలన నష్టపోతాయని నిపుణులు వాదిస్తున్నారు.

2. ప్రెజర్ తో వండిన అన్నం ప్రయోజనాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అన్నం ఉడకబెట్టడం లేదా ఆవిరి చేయడం కాకుండా ప్రెజర్ కుక్కర్‌లో వండినప్పుడు, అధిక పీడనం, వేడి అన్నం మీకు లభించని అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఒత్తిడితో వండిన అన్నం జీర్ణక్రియకు మంచిది. మెరుగైన పోషక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రొటీన్, స్టార్చ్, ఫైబర్ వంటి మాక్రోన్యూట్రియెంట్‌లు వేడితో పెరుగుతాయని, ఇలా వండిన అన్నం నుండి మీకు మరింత పోషక ప్రయోజనాలను అందజేస్తుందని కనుగొన్నారు.

అదనంగా, అధిక పీడనం కారణంగా, బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఉంటే అవి నాశనం అవుతాయి. ఉడకబెట్టడం లేదా ఆవిరి చేయడం వంటి సాంప్రదాయ వంట పద్ధతులు అలా చేయడంలో విఫలమవుతాయి.

మొత్తమ్మీద చూస్తే.. గణాంకాల ప్రకారం, బియ్యం వండే ఇతర మార్గాల కంటే ఒత్తిడితో వండిన అన్నం ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంది. అదే సమయంలో, ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!