Halth News: యంగ్ ఏజ్ లో వృద్దులుగా కనడబుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే..

కొంతమందిని చూస్తే పెద్ద వయసు వారిలా.. వృద్ధుల్లా కనబడతారు. కాని వారి వయసు తక్కువుగానే ఉంటుంది. మరికొంత మంది అయితే వృద్ధాప్యం వచ్చినా వారిని చూస్తే అసలు వయసు బయట పడదు. దానికి వారి..

Halth News: యంగ్ ఏజ్ లో వృద్దులుగా కనడబుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే..
Beauty Tips
Follow us

|

Updated on: Aug 28, 2022 | 5:16 PM

Health News: కొంతమందిని చూస్తే పెద్ద వయసు వారిలా.. వృద్ధుల్లా కనబడతారు. కాని వారి వయసు తక్కువుగానే ఉంటుంది. మరికొంత మంది అయితే వృద్ధాప్యం వచ్చినా వారిని చూస్తే అసలు వయసు బయట పడదు. దానికి వారి శరీరం, ముఖ సౌందర్యం పట్ల వారు తీసుకుంటున్న జాగ్రత్తలే కారణమని చెప్పుకోవచ్చు. 20, 30 ఏళ్ల వయసులోని వారు కొన్ని సందర్భాల్లో ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనిపిస్తుంటారు. వారి ముఖంలో, శరీరంలో గల మార్పులే దానికి కారణం. అలా యంగ్ ఏజ్ లో వృద్ధులుగా కనబడకూడదు అంటే మనం తీసుకునే ఆహారం, సౌందర్య సంరక్షణపై చాలా శ్రద్ధ అవసరమని చెబుతున్నారు నిపుణులు.

సాదారణంగా వయస్సు పెరుగుతున్న కొద్ది చర్మంపై ముడతలు పడటం సహజం, కానీ చిన్న వయసులోనే కొంతమంది ఈసమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. 20 ఏళ్ల వయసులో వారు 50 ఏళ్లు పైబడిన వారిలా కనిపిస్తారు. ఇలా కనబడటానికి చాలా కారణాలు ఉన్నాయి. చర్మ గ్రంధుల నుంచి విడుదలయ్యే తైలం.. మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తుంది. యుక్త వయస్సులో చర్మం కాంతి వంతంగా, అందంగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో చర్మ సంరక్షణ పట్ల అజాగ్రత్తగా ఉంటే అకాల వృద్ధాప్య సంకేతాలు ముఖంపై కనిపిస్తుంటాయి. అందుకే చర్మ సంరక్షణపై శ్రద్ధ పెట్టడంతో పాటు.. మరికొన్ని అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం..

చర్మంపై ముడతలు రావడం వల్ల యంగ్ ఏజ్ లో పెద్ద వయస్సు వారిలా కనిపిస్తుంటారు. ఈముడతలను తగ్గించుకోవడానికి సులభమైన, సహజమైన మార్గం పుష్కలంగా నీరు తాగడం, దీని వల్ల చర్మంలోని తేమ అలాగే ముఖంపై ఉండి, అకాల ముడతల సమస్యను తగ్గిస్తుంది. నీరు ఎక్కువుగా తాగడం వలన శరీరంలోని విషపూరిత వ్యర్థాలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ముఖంపై అకాల ముడతలు రావడానికి సరిగ్గా నిద్రలేకపోవడం కూడా కారణం కావచ్చు. నిద్ర లేకపోవడం వల్ల ముఖ కండరాలు కుంచించుకుపోతాయి. దీంతో ముఖంపై ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అందుకే రోజుకు 7నుంచి8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. ఎక్కువ చక్కెర, తీపి పదార్థాలు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్, ఎలాస్టిన్ తయారు చేసే చర్మం సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. దీంతో ముఖం, మెడ, చేతులపై ముడతలు రావడం ప్రారంభమవుతాయి. చిన్న వయసులో పెద్దవారిలా కనిపిస్తున్నవారు చక్కెను తక్కువుగా వాడటం మంచిది. పొగ త్రాగడం చర్మానికి హనికరం, ఇది చర్మ కణజాలాన్ని నాశనం చేస్తుంది. కణజాల నిర్మాణాన్ని అడ్డుకుంటుంది. దీంతో చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకునే వారు ధూమపానాన్ని మానేయడం మంచిది. పని ఒత్తిడి కారణంగా కూడా ముఖం మీద అకాల వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. అందుకే వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మనిషి సంతోషంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం ఉత్తమమైన మార్గం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..