AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి తింటే మైండ్ దొబ్బిద్ది జర జాగ్రత్త..! మెదడు చురుగ్గా ఉండాలంటే వీటిని పొరపాటున కూడా ముట్టుకోకండి..

మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి.. దానిని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పోషకాహారం అవసరం.. వాస్తవానికి మెదడు మానవుని తలభాగంలో కపాలంతో రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి మెదడు ముఖ్యమైన కేంద్రం. మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకునే గుణం ఉటుంది. ఇంకా మనం ఏం చేయాలన్నా.. తినాలన్నా.. మెదడు ఆజ్ఞతోనే జరుగుతుంది.

ఇవి తింటే మైండ్ దొబ్బిద్ది జర జాగ్రత్త..! మెదడు చురుగ్గా ఉండాలంటే వీటిని పొరపాటున కూడా ముట్టుకోకండి..
Mental Health
Shaik Madar Saheb
|

Updated on: Mar 26, 2024 | 1:30 PM

Share

మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి.. దానిని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పోషకాహారం అవసరం.. వాస్తవానికి మెదడు మానవుని తలభాగంలో కపాలంతో రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి మెదడు ముఖ్యమైన కేంద్రం. మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకునే గుణం ఉటుంది. ఇంకా మనం ఏం చేయాలన్నా.. తినాలన్నా.. మెదడు ఆజ్ఞతోనే జరుగుతుంది. మెదడు బలంగా ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే మిగిలిన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మెదడును పట్టించుకోకపోతే అంతా వ్యర్థమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే, మన మెదడుకు చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ.. కొన్ని ఆహారాలు మాత్రం మెదడుకు తీవ్ర హాని కలిగిస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏయే ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

చక్కెర: పంచదార లేదా తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని మనం తరచుగా చెబుతుంటాం. కానీ మితిమీరిన తీపి పదార్థాలు తినడం మెదడుకు మంచిది కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగించడమే కాకుండా మెదడుకు గణనీయమైన నష్టాన్ని కూడా కలిగిస్తుంది.

ఆయిల్ ఫుడ్: అధికంగా ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడే వారు తరచుగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు బాధితులుగా మారతారు. అంతేకాకుండా, ఆయిల్ ఫుడ్ కూడా మన మెదడుకు హాని చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, డాల్డా వంటి అధిక మొత్తంలో నూనె, కొవ్వు ఉన్న ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హానికరం..

కెఫిన్: భారతదేశంలో టీని ఇష్టపడేవారికి కొరతే లేదు. నీళ్ల తర్వాత అత్యధికంగా వినియోగించే పానీయం ఇదే.. కొందరు కాఫీని కూడా తీసుకుంటారు. ఈ రెండింటిలోనూ పెద్ద మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది నేరుగా నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. నిద్రను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలంలో మెదడుకు మంచిది కాదు.

అతివేగంగా తినడం- ధూమపానం: అతి వేగంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, మెదడుకు సరైన మొత్తంలో న్యూరోట్రాన్స్‌మిటర్లు అందవని నిపుణులు చెబుతున్నారు. ఇది పొగాకును ఎక్కువగా తీసుకున్న దానికంటే హానికరం.. అతివేగంగా తినడం, ధూమపానం రెండూ జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..