Winter Weight Loss Tips: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. శీతాకాలమే చాలా బెస్ట్ అంటోన్న సెల్ రిపోర్ట్.. ఎందుకో తెలుసా?
Weight Loss Tips: సెల్ రిపోర్ట్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, చలికాలంలో బరువు వేగంగా తగ్గుతారంట. బయటి వాతారణం చాలా చల్లగా ఉండడంతో కొవ్వును కరిగించే సామర్థ్యం వేగంగా పెరుగుతుందంట.
Weight Loss During Winters: కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత మనమందరం మన ఇళ్లలో ఉండిపోయాం. ఎక్కువ కాలం ఇంట్లో ఉండటం వల్ల చాలా మంది బరువు పెరిగే సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు పెరగడం చాలా సులభమైన పని. కానీ, దాన్ని తగ్గించడం మాత్రం చాలా కష్టం. శీతాకాలంలో వ్యాయామాలు చేయడం ద్వారా మీ పెరిగిన బరువును తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటే, మీకో శుభవార్త. సెల్ రిపోర్ట్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం చలిలో బరువు వేగంగా తగ్గుతారంట. చల్లగా ఉండే వెలుపలి వాతావరణంలో కొవ్వును కరిగించే సామర్థ్యం వేగంగా పెరుగుతుందని తేల్చేశారు. దీంతో బరువు తగ్గాలని కోరుకునే వారు శీతాకాలంలో తగిన ప్రయత్నాలు చేస్తే ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా బరువు తగ్గిపోతారు.
జీవనశైలిలో మార్పులతో.. మనం బరువు తగ్గడం గురించి ఆలోచిస్తే.. మన మనస్సులో మొదటగా గుర్తుకు వచ్చేది వ్యాయామంతోపాటు డైటింగ్. కొంతమంది బరువు తగ్గడానికి జిమ్‌కు వెళతారు. కొంతమంది యోగా సహాయం తీసుకుంటారు. వీటికి తోడు పర్యావరణం కూడా బరువు తగ్గడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని చాలామందికి తెలియదు. సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ నివేదికలో, శీతాకాలం కేలరీలను బర్న్ చేయడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించారు. కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, 8 మంది వ్యక్తులపై చేసిన పరిశోధన ప్రకారం, శీతాకాలంలో చల్లటి నీటిలో ఈదుతున్న వ్యక్తులు, వారి బరువు చాలా త్వరగా తగ్గారంట. వేసవిలో వ్యాయామం చేసేవారు, బరువు తగ్గే రేటు తక్కువగా కనిపిస్తుందంట.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ పరిశోధనలో చలిలో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొన్ని రకాల కొవ్వు తగ్గుతుందని కూడా తేలింది. మీరు వీలైనంత త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు చలిలో పని చేయడం వల్ల గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవ్చని తెలింది. సరైన మార్గంలో వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రతో మీరు మీ బరువును వేగంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
Also Read: Dry Cough: పొడి దగ్గుని తక్కువ అంచనా వేయకండి..! తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..
Hand Wash: తినే ముందు చేతులు కడుక్కుంటున్నారా.. లేకుంటే వ్యాధులు రావొచ్చు..
Least Sleeping: బలవంతంగా నిద్ర పక్కన పెట్టి టీవీ చూస్తున్నారా? ఇది చాలా ప్రమాదం..ఎందుకంటే..