AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.. ఈ విటమిన్ల లోపంతో గుండెపోటు వచ్చే ప్రమాదం..

విటమిన్లు శరీర సాధారణ అభివృద్ధి, పెరుగుదల, సరైన పనితీరుకు అత్యంత అవసరం. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.. శక్తిని అందిస్తాయి, కళ్ళు, ఎముకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. శరీరం ఆహారం నుండి శక్తిని పొందడానికి సహాయపడతాయి. అయితే.. విటమిన్లు శరీర అభివృద్ధికి సహాయపడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.. ఈ విటమిన్ల లోపంతో గుండెపోటు వచ్చే ప్రమాదం..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2025 | 3:10 PM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం మంచిది. వాస్తవానికి విటమిన్లు, ఖనిజాలు అనేవి మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సూక్ష్మపోషకాలు… అయితే, విటమిన్లు శరీర సాధారణ అభివృద్ధి, పెరుగుదల, సరైన పనితీరుకు అత్యంత అవసరం. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.. శక్తిని అందిస్తాయి, కళ్ళు, ఎముకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. శరీరం ఆహారం నుండి శక్తిని పొందడానికి సహాయపడతాయి. అయితే.. విటమిన్లు శరీర అభివృద్ధికి సహాయపడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ల లోపం గుండె సమస్యలను కలిగిస్తుంది. ఏ విటమిన్ లోపం గుండె సమస్యలను కలిగిస్తుంది..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఈ విటమిన్లు గుండె ఆరోగ్యానికి చాలా అవసరం ..

ఆరోగ్యకరమైన గుండెకు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి9, విటమిన్ బి12 – విటమిన్ ఇ గుండెకు చాలా ముఖ్యమైనవి. రక్త ధమనులను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. విటమిన్ డి బిపి, వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఈ విటమిన్ల లోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది..

కొన్ని విటమిన్లు గుండెకు చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్ల లోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా విటమిన్ డి లేదా విటమిన్ బి 12 లోపం శరీరంలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే విటమిన్ డి లోపం గుండెపోటు – మధుమేహ సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ బి 12 లోపం కారణంగా, హోమోసిస్టీన్ అమైనో ఆమ్లం స్థాయి పెరుగుతుంది.. దీని కారణంగా గుండె ధమనులు దెబ్బతింటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

విటమిన్‌ల లోపాన్ని ఎలా అధిగమించాలి ..

ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

విటమిన్ బి 12 కోసం, గుడ్లు, చికెన్, చేపలు – పాల ఉత్పత్తులను తీసుకోండి.

విటమిన్ డి కోసం, గుడ్లు – చికెన్ తినండి.

విటమిన్ సి కోసం, సిట్రస్ పండ్లను తీసుకోండి.

అంతేకాకుండా తృణధాన్యాలతోపాటు.. ఆకు కూరలు, కూరగాయలు కూడా మంచి పోషకాలను అందిస్తాయి..

(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని  హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్