Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: Vitamin D: విటమిన్ డి లోపాన్ని ఈ సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించొచ్చు.. అది ఎలాగంటే..!

విటమిన్ డి(Vitamin D) అనేది కొవ్వులో కరిగే విటమిన్, ఇది అనేక జీవ ప్రక్రియలలో ప్రాముఖ పాత్ర వహిస్తుంది....

Vitamin D: Vitamin D: విటమిన్ డి లోపాన్ని ఈ సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించొచ్చు.. అది ఎలాగంటే..!
Vitamin D
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 11, 2022 | 4:07 PM

విటమిన్ డి(Vitamin D) అనేది కొవ్వులో కరిగే విటమిన్, ఇది అనేక జీవ ప్రక్రియలలో ప్రాముఖ పాత్ర వహిస్తుంది. కాల్షియం(calcium) గ్రహించడం, ఎముక, కండరాలు(muscle), గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం అయినప్పటికీ చాలా మందికి దాని విటమిన్ డి లోపం ఉంది. విటమిన్ డి సూర్యకాంతి(sun light)లో సమృద్ధిగా దొరుకుతుంది. మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు , మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. తర్వాత శరీరంలోని వివిధ భాగాలకు రవాణా అవుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ డి తగినంత మొత్తంలో పొందని వారు లేదా విటమిన్ డి లోపం ఉన్నవారు వాసన, రుచిని కోల్పోతారు. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన 2020 అధ్యయనంలో పరిశోధకులు విటమిన్ డి లోపం వల్ల వాసన, రుచి కోల్పోతారని తేలింది. వాసన కోల్పోవడం లేద ఎనిమిది వాసనలలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వాసనలను సరిగ్గా గుర్తించడంలో ఇబ్బంది పడతారని నివేదికి పేర్కొంది.

ఒక రోజులో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న వారితో పోలిస్తే, విటమిన్ డి లోపం ఉన్న వ్యక్తులు జీవితంలో తరువాత రుచి, వాసన కోల్పోయే అవకాశం 39 శాతం ఉందని పరిశోధకులు వెల్లడించారు. సూర్యరశ్మిలో విటమిన్ డి లభిస్తుంది కాబట్టి, మీరు ప్రతిరోజూ సూర్యుడి ఎండలో కొంత సమయం గడపడం ద్వారా విటమిన్ డి తగినంత పొందవచ్చు. అయితే ఎండకు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటే ఉండొద్దని, ఉదయం, సాయంత్రం ఎండలో 2 గంటలు ఉంటే చాలని చెబుతున్నారు. సూర్యరశ్మి నిజానికి విటమిన్ డి యొక్క ఉత్తమ మూలం. ఇది మనకు సమృద్ధిగా లభిస్తుంది. కానీ మీరు ఈ పోషకాన్ని తీసుకోవడం పెంచుకోవాలనుకుంటే, మీరు వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు.

Read Also.. Star Fruit Benefits: స్టార్ ఫ్రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. దీనిని సూపర్ ఫుడ్ అంటున్న పోషకాహార నిపుణులు..