ఎర్రరక్త కణాల తయారీకి ఈ విటమిన్‌ కచ్చితంగా అవసరం.. అందుకే ఈ ఆహారాలు..!

uppula Raju

uppula Raju |

Updated on: Mar 22, 2022 | 5:49 AM

Vitamin B12: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ బి-12 చాలా ముఖ్యం. దీనిలోపం ఉంటే మెదడు, నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. విటమిన్

ఎర్రరక్త కణాల తయారీకి ఈ విటమిన్‌ కచ్చితంగా అవసరం.. అందుకే ఈ ఆహారాలు..!
Red Blood Cells

Vitamin B12: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ బి-12 చాలా ముఖ్యం. దీనిలోపం ఉంటే మెదడు, నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. విటమిన్ B-12 ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు చాలా ముఖ్యమైనది. ఇది శరీరానికి ఫోలిక్ యాసిడ్‌ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ B-12 లోపం ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మానసిక సమస్యలు, ఎముకలు, కీళ్ల సమస్యలు, రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ B-12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు లోపాన్ని భర్తీ చేయవచ్చు. శాకాహారులు కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా విటమిన్ B-12 లోపాన్ని సరిచేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. సోయాబీన్‌: సోయా ఉత్పత్తులలో విటమిన్ B-12 పుష్కలంగా లభిస్తుంది. మీరు సోయా పాలు, టోఫు లేదా సోయాబీన్ కూర తినవచ్చు.

2. పెరుగు: మీరు ఆహారంలో పెరుగును తప్పనిసరిగా చేర్చాలి. పెరుగులో విటమిన్ బి2, బి1, బి12 ఉంటాయి. విటమిన్ B-12 లోపాన్ని తీర్చడానికి మీరు తక్కువ కొవ్వు పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు.

3. ఓట్స్‌: ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు, విటమిన్లు అందుతాయి. ఓట్స్‌లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. పాలు: విటమిన్ B12 కోసం మీరు తప్పనిసరిగా పాలను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ బి12 పాలలో అధిక మొత్తంలో లభిస్తుంది.

5. పనీర్‌: పన్నీర్‌లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. శాఖాహారులకు ఇది మంచి ఎంపిక.

6. బ్రోకలీ: మీరు తప్పనిసరిగా బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ బి12తో పాటు ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!

Viral Video: డ్యాన్స్‌ అంటే ఇలా ఉండాలి.. పరేషాన్ అవుతున్న నెటిజన్లు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu