AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viagra: వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు.. పూర్తి వివరాలు

శృంగారాన్ని ఎక్కువ సేపు ఎంజాయ్ చేయడానికి మగాళ్లు వయాగ్రాను ఉపయోగిస్తారు. వయాగ్రా వేసుకుంటే.. దాని ప్రభావం దాదాపు ఆరు గంటల వరకు ఉంటుంది. రెండు గంటలపాటు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలామంది డాక్టర్ల సలహా తీసుకోకుండానే వయాగ్రాను వాడుతుంటారు. కానీ అన్ని వేళలా వయాగ్రా వాడటం సరైంది కాదు.

Viagra: వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు.. పూర్తి వివరాలు
ViagraImage Credit source: SCIENCE PHOTO LIBRARY
Ram Naramaneni
|

Updated on: May 04, 2024 | 4:26 PM

Share

వయాగ్రా ట్యాబ్లెట్ అనేది.. స్కలనాన్ని అదుపులో ఉంచి అంగాన్ని ఎక్కువ సేపు గట్టిగా ఉంచేందుకు సాయపడుతుంది. అయితే దీన్ని ఎలా పడితే అలా వాడితే తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది. గతంలో నాగపూర్‌కి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి వయాగ్రా తీసుకోవడం వల్ల మరణించాడు కూడా.  వయాగ్రా కేవలం అంగ స్తంభన సమస్యలు కలిగిన పురుషులు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చాలా చోట్ల మెడికల్ షాపుల్లో మందుల చీటీ లేకుండానే వయాగ్రా ఇచ్చేస్తుంటారు. కానీ.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలన్నది నిపుణుల వెర్షన్. ఎందుకంటే.. మీరు వేసుకునే ఇతర మందుల కారణంగా ఇది విపరీత రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. శృంగారంలో పాల్గొనడానికి ఆరోగ్యం సహకరించనవి పురుషులకు దీనిని ఇవ్వకూడదు. కొన్ని స్టెప్స్ ఎక్కగానే అలసిపోయేవారు.. కొంచెం దూరం నడవగానే.. ఆయాసంతో ఇబ్బందిపడేవారు ఈ పిల్స్ తీసుకోకూడదు. గుండెజబ్బులు, రక్తనాళ సమస్యలు ఉన్నవారు కూడా ఇవి తీసుకోకుండా ఉండటమే మంచిది.  శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఈ పిల్ వేసుకోవాలి. మీరు ఫుల్‌గా ఫుడ్ తిని దీన్ని తీసుకుంటే.. స్లోగా వర్క్ అవుతుంది.

ద్రాక్ష పళ్లు తిని కానీ, జ్యూస్ తాగి కానీ ఈ పిల్ వేసుకోకూడదు. ఎందుకంటే ద్రాక్ష వయాగ్రా పనితీరుపై ప్రభావం చూపుతుంది. పిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని భావిస్తే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. రోజుకు ఒక 50 ఎంజీ పిల్ కన్నా ఎక్కువ తీసుకోవడం ప్రమాదకరం. అధిక మోతాదులో మద్యం సేవించినప్పుడు, డ్రగ్స్ వాడినప్పుడు వయాగ్రా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పిల్ తీసుకున్న కొందరు.. అంగ స్తంభన ఎక్కువ  సమయం ఉండి.. ఇబ్బంది పడిన కంప్లైంటులు ఉన్నాయి. అలాంటివారు వైద్య సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిల్ తీసుకున్న తర్వాత మొహం వేడెక్కడం, ఎర్రబారటం, చూపు అస్పష్టంగా మారడం, మత్తుగా అనిపించడం, వికారం, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ కొందరికి ఉండొచ్చు. అయితే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అయిన.. గుండెల్లో నొప్పి, ఫిట్స్, చూపు కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మొహం వాయడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. రయోసిగువట్, రిటోనేవిర్ వంటి మెడిసిన్ వాడేవారు.. వయాగ్రా తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీరు ఏదైనా వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఉంటే.. పక్కాగా డాక్టర్ సలహాతో ఈ పిల్ వాడండి.

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. మీకు ఈ పిల్స్ తీసుకునేముందు వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..