AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు..!

తీవ్రమైన అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల కొత్త నివేదిక ఏం చెబుతుందో తెలుసా..? మనలో చాలా మందికి అలర్జీ సమస్యలు ఉంటాయి. కానీ అలర్జీ వల్ల గుండెపోటు వస్తుందంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇటీవల కొన్ని అరుదైన వైద్య సంఘటనలు ఈ ప్రమాదాన్ని నిజం చేస్తున్నాయి.

అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు..!
Heart Healthy
Prashanthi V
|

Updated on: Jun 22, 2025 | 9:20 PM

Share

ఒకవేళ మనకు తెలియకపోయినా.. పురుగు కాటు లేదా కొన్ని పదార్థాలకు అలర్జీ ఉంటే అలాంటి పదార్థాలు శరీరంలోకి వచ్చినప్పుడు తీవ్రమైన మార్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ఇది గుండెకు సంబంధించి ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చు. అలర్జీ అంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ హానికరం కాని పదార్థాన్ని ప్రమాదకరంగా భావించి తీవ్రంగా స్పందించడం. ఈ స్పందనలో హిస్టామిన్ లాంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి రక్తనాళాలను పెద్దవి చేసి రక్తపోటును తగ్గిస్తాయి. దీని వల్ల గుండెకు కావాల్సిన ఆక్సిజన్ అందదు. ఇది గుండెను బలహీనపరిచి గుండెపోటుకు దారితీయవచ్చు.

కౌనిస్ సిండ్రోమ్ (Kounis Syndrome) అనే అరుదైన జబ్బు అలర్జీ వచ్చినప్పుడు గుండెకు నష్టం కలిగిస్తుంది. దీన్ని అలర్జిక్ యాంజినా (Allergic Angina) అని కూడా అంటారు. ఇది తీవ్రమైన అలర్జీలు (Anaphylaxis) వచ్చినప్పుడు కనిపించవచ్చు. తేనెటీగ కుట్టడం, కొన్ని ఆహార పదార్థాలు, మందులు దీనికి కారణం కావచ్చు.

ఈ స్థితిలో శరీరం విడుదల చేసే రసాయనాలు రక్తనాళాల్లోని ఫలకాన్ని (plaque) విరిగిపోయేలా చేస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గుండెకు రక్తం అందకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

తేనెటీగలు లేదా చీమలు కుట్టినప్పుడు వచ్చే అలెర్జీ ప్రతిచర్యలు (allergic reactions) గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులకు (cardiac emergencies) ఎలా దారితీస్తాయో రెండు నిజ జీవిత సంఘటనలు వెల్లడిస్తున్నాయి. నిపుణుల నివేదిక ప్రకారం.. ఒక 31 ఏళ్ల వ్యక్తి తేనెటీగల పెంపకం కేంద్రంలో పనిచేస్తున్నాడు. అతనికి తేనెటీగ విషంతో అలెర్జీ ఉందని తెలీదు. అతన్ని చాలా సార్లు తేనెటీగలు కుట్టాయి. అతని ధమనులలో (arteries) కేవలం 40 శాతం అడ్డంకి (plaque buildup) ఉన్నప్పటికీ.. అలెర్జీ ప్రతిచర్య వల్ల అది తీవ్రమైంది. అడ్డుపడిన ధమనిని తిరిగి తెరవడానికి అతనికి స్టెంట్ వేయాల్సి వచ్చింది.

మరో సందర్భంలో చీమ కుట్టడం వల్ల ఇలాంటి ప్రతిచర్య సంభవించి ధమనులలోని అడ్డంకి పాక్షికంగా తొలగింది (plaque erosion). ఇది మొదటి కేసు అంత తీవ్రంగా లేనప్పటికీ.. స్టెంట్ అవసరం లేకపోయినా అది పాక్షిక అడ్డంకిని (partial blockage) కలిగించింది.

తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ సాయం తీసుకోవడం చాలా అవసరం. హై డోస్ అడ్రినలిన్ ఇంజెక్షన్ (Epinephrine) ఇవ్వడం.. అవసరమైన చికిత్సలు మొదలు పెట్టడం చాలా ముఖ్యం. ఆక్సిజన్ అందించి ECG ద్వారా గుండె పనితీరును గమనించాలి. ఇది ప్రాణాలను కాపాడే కీలకమైన పని.

అలర్జీలు చాలా మందిలో చిన్న సమస్యలుగా కనిపించినా.. కొంతమందిలో అవి ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు అలర్జీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలర్జీ పట్ల తమ శరీరం ఎలా స్పందిస్తుందో ముందుగానే పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు దగ్గర ఉంచుకోవడం చాలా ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..