Cholesterol Drug: చెడు కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం.. ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఇస్తుంటారు. అయితే దీనిని మరలా మరలా తీసుకోవాల్సి వస్తుంది.
Cholesterol Drug: మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకపోయిందా..? అయితే మీకోసమే ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఇస్తుంటారు. అయితే దీనిని మరలా మరలా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం వచ్చిన ఔషధంతో ఇలాంటి అవసరం ఏమాత్రం ఉండదంట. ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చిన మెడిసిన్‌తో చెడు కొలెస్ట్రాల్ బాధితులకు బాధలు తప్పనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ‘ఎక్లిసిరెన్’ అని పేరు పెట్టారు. అయితే ఈ ఇంజెక్షన్‌ను సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాలంట. దీనిని యూకే ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ (NHS) బుధవారం నుంచి ప్రారంభించింది. నిపుణులు దీనిని ‘గేమ్ చేంజింగ్’ ట్రీట్మెంట్ అని పిలుస్తున్నారు.
కొత్త ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. ఈ కొత్త ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండనుంది, భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుంది లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
50 శాతం తగ్గనున్న చెడు కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో సేకరించే కొవ్వు. జిగటగా ఉంటుంది. క్రమంగా, ఇది శరీరంలో పేరుకుపోతుంది. దీని వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధమనులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనిని శాస్త్రీయ భాషలో ఎల్‌డీఎల్ (LDL) కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తుంటారు.
ఓ నివేదిక ప్రకారం.. చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడే వారు ప్రతీ 6 నెలలకు ఓసారి ఇంబెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకోవడం నుంచి మాత్రం ఉపశమనం లభించనుంది. కొత్త ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రోగులలో కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
హెల్త్ ఆఫీసర్ సాజిద్ జావిద్ మాట్లాడుతూ.. ఇది గుండె జబ్బులను నిరోధించి, ప్రాణాలను కాపాడేందుకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్ స్టాటిన్స్ కంటే చాలా ప్రభావవంతమైనది. కొన్ని కారణాలతో మెడిసిన్ తీసుకోలేని వారు కూడా ఈ ఇంజెక్షన్‌ను వేసుకోవచ్చు.
ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది.. ఈ ఇంజెక్షన్ PCSK9 అనే ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా కాలేయం, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. PCSK9 ప్రోటీన్ కారణంగా శరీర అవయవాలు కొలెస్ట్రాల్‌ను తొలగించలేకపోతుంటాయి. కొత్త ఇంజెక్షన్‌తో ఈ ప్రోటీన్‌ను అడ్డుకోవడం చాలా సులభం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో, వ్యాధులు సంభవించే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ప్రారంభ దశలో ఈ ఇంజెక్షన్‌ను 3 లక్షల రోగులకు యూకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బులతో బాధపడుతున్న లేదా గుండెపోటుతో బాధపడుతున్న రోగులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపింది. కొత్త ఇంజెక్షన్ 30,000 మంది ప్రాణాలను కాపాడగలదని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే దశాబ్దంలో 55,000 మందిని గుండెపోటును నుంచి కాపాడొచ్చని తెలిపారు.
యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రతి 5 మంది ముసలివారిలో ఇద్దరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారని చెప్పారు. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణంగా ఉందని, ఇంగ్లండ్‌లో ప్రతి 4 మరణాలలో ఒకరు ఈకారణంగానే మరణిస్తున్నట్లు పేర్కొంది.
యూకేలో దాదాపు 80 శాతం మంది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి స్టాటిన్‌లను ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని తలనొప్పి వంటి దుష్ప్రభావాలను కలిగిస్తున్నట్లు వెల్లడైంది.
ఇంజెక్షన్ ధర.. ఈ ఔషధంపై పరిశోధన చేసిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ కౌశిక్ రే మాట్లాడుతూ.. ‘ఇది కొలెస్టాల్‌తో బాధపడేవారికి గొప్ప శుభవార్త. ఇది వారికి మందుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది’ అని తెలిపాడు.
ఒక ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ .2 లక్షలు. దీనిని సంవత్సరానికి రెండుసార్లు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏటా దాదాపు రూ .4 లక్షలు ఇంజెక్షన్‌ల కోసం చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
White Sugar: తెల్ల చక్కెర ఎఫెక్ట్..! పిల్లల్లో డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గుదల..? వెరీ డేంజరస్
Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి