మీ పిల్లల్ని పాఠశాలలకు పంపిస్తున్నారా..! అయితే కచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకోండి..

Health News: ఏడాదిన్నర తరువాత పిల్లలు తిరిగి స్కూల్స్‌కి వెళ్తున్నారు. పాఠశాలలకు వెళ్లడానికి పిల్లలు ఉత్సాహంగా ఉన్నా డెల్టా వేరియంట్, జలుబు, కరోనా థర్డ్‌ వేవ్‌, శ్వాసకోశ

మీ పిల్లల్ని పాఠశాలలకు పంపిస్తున్నారా..! అయితే కచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకోండి..
Health News

Health News: ఏడాదిన్నర తరువాత పిల్లలు తిరిగి స్కూల్స్‌కి వెళ్తున్నారు. పాఠశాలలకు వెళ్లడానికి పిల్లలు ఉత్సాహంగా ఉన్నా డెల్టా వేరియంట్, జలుబు, కరోనా థర్డ్‌ వేవ్‌, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ వంటివి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులలో తల్లిదండ్రులు కచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

1. లక్షణాలను బట్టి అది జలుబా, కొవిడా అనేది నిర్ధారించుకోండి..
తక్కువ గ్రేడ్ జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, జీర్ణశయాంతర సమస్యలు ఉన్న పిల్లలలో COVID-19 ఉండవచ్చు. అయితే మామూలు జలుబు ఉన్నవారిలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయని గుర్తించండి.

2. కొవిడ్‌ సోకిన వారిలో లక్షణాలు ఉండవచ్చు.. లేదా ఉండకపోవచ్చు..
వాసన, రుచిని కోల్పోవడం సాధారణంగా చిన్నపిల్లలలో జరుగదు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. కొవిడ్‌ సోకిన పిల్లలలో కొంతమందికి లక్షణాలు ఉండవచ్చు. కొంతమందికి ఆలస్యంగా బయటపడవచ్చు.

3. పిల్లలలో కొవిడ్ లక్షణాలు
పిల్లలలో మీరు నిరంతర జ్వరం, చర్మ మచ్చలు లేదా దద్దుర్లు, అలసట, ఎర్రటి కళ్ళు, విరేచనాలు వంటి సమస్యలను చూసినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కష్ట సమయాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీ నొప్పి, పసుపు లేదా నీలం కళ్ళు, ఇవి తీవ్రమైన లక్షణాలు.

4. తాజాగా MIS-C అనగా మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తోందని స్పష్టమైంది. కుటుంబంలో ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారిద్వారా పిల్లలకు సంభవిస్తుంది. కోవిడ్ రోగి కోలుకున్నా, పిల్లలు అతనితో సంబంధం కలిగి ఉంటే ఈ వ్యాధి సోకుతుంది. అయినప్పటికీ కరోనా బారిన పడిన పిల్లలలో 0.14 శాతం మంది మాత్రమే MIS-C కి గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సంఖ్య పెరుగుతుంది.

Meet the Chukudu: ఇంజిన్ లేదు, ఇంధ‌నం అవ‌స‌రం లేదు.. అయినా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

Viral Video: మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతి.. కానీ డామిట్‌ కథ అడ్డం తిరిగింది..!

OTT Platforms: థియేటర్స్ తెరుచుకుంటున్నా తగ్గని డిజిటల్ జోరు.. ఓటీటీకే ఓటేస్తున్న హీరోలు..

Click on your DTH Provider to Add TV9 Telugu