AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Food: ఈ ఆహారాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి.. వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వకండి. ఇంతకీ అవేంటంటే..

Anti Aging Food: వయసు పెరగకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా ముసలి వాళ్లం కాకూడదని భావిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ఎంత వయసున్న చూడడానికి యవ్వనంగా కనిపిస్తారు. దీనికి...

Anti Aging Food: ఈ ఆహారాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి.. వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వకండి. ఇంతకీ అవేంటంటే..
Anti Aging Food
Narender Vaitla
|

Updated on: Jul 08, 2021 | 9:05 PM

Share

Anti Aging Food: వయసు పెరగకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా ముసలి వాళ్లం కాకూడదని భావిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ఎంత వయసున్న చూడడానికి యవ్వనంగా కనిపిస్తారు. దీనికి వారు తీసుకునే ఆహారమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యవ్వనంగా కనిపించేలా చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? వృద్ధాప్యం అంత తొందరగా దరి చేరకుండా ఉండాలంటే ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో భాగం చేసుకోండి. ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

మొలకెత్తిన ధాన్యాలు:

ఇటీవల చాలా మంది మొలకెత్తిన ధాన్యాలను అలవాటు చేసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచేలా చేస్తాయి. దీంతో ముడతలు తొందరగా రావు.

టొమాటో:

టొమాటో చాలా మంది ముఖానికి ఫేషియల్‌గా ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో ఉండే లైకోపీన్‌ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి రక్షిస్తుంది. ఇక టమాటో ఆహారం రూపంలో తీసుకున్నా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కూరగాయలు:

రక్తంలో హిమోగ్లోబిన్‌ అధికంగా ఉంటే మొహం కాంతి వంతంగా మారుతుంది. కాబట్టి హిమోగ్లోబిన్‌ పెంచే ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా.. క్యారెట్, బచ్చలికూర, మెంతి, దోసకాయ, పొట్లకాయ వంటి ఆహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

గ్రీన్‌ టీ:

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ అందాన్ని సంరక్షిస్తుంది. నిత్యం గ్రీన్‌ టీ తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గిస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా గ్రీన్‌టీని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నీరు:

ప్రతిరోజూ తగినంత మంచి నీరు తాగితే చాలా రకలా రోగాలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. చర్మాన్ని మెరిసేలా చేయడం, శరీరం నుంచి విషపూరిత అంశాలను బయటకు తొలగించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలి.

పసుపు, పాలు:

పసుపు మంచి యాంటీబయోటిక్‌ అనే విషయం అని తెలిసిందే. అయితే ఇది చర్మ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు పసుపు, పాలు కలిపి తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

Also Read: Homeremedies For Sinus: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..

Zika Virus : కేరళలో జికా వైరస్ కలకలం .. గర్భిణికి నిర్ధారణ.. మరో 13 మంది అనుమానితులు

Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో వైద్యులకు షాక్