AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లు మస్తు హెల్ప్ చేస్తయ్..! ఓసారి తిని చూడండి..!

మనం ఎప్పుడూ హార్ట్ హెల్త్ గురించే ఎక్కువ ఆలోచిస్తాం. కానీ మన బాడీలో లివర్, కిడ్నీలు చేసే పని గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి ఈ రెండు అవయవాలు మన శరీరంలో ఇంపార్టెంట్ పనులు చేస్తాయి.. ఫుడ్‌ లోని పోషకాలను లాక్కోవడం, బ్లడ్‌ను క్లీన్ చేయడం, బాడీలోని టాక్సిన్స్‌ను బయటికి పంపడం లాంటివి. ఒక పవర్‌ఫుల్ లైఫ్ స్టైల్‌కి ఇవి మెయిన్ పిల్లర్స్ లాంటివి.

కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లు మస్తు హెల్ప్ చేస్తయ్..! ఓసారి తిని చూడండి..!
Healthy Kidneys
Prashanthi V
|

Updated on: Jul 17, 2025 | 8:50 PM

Share

మన బాడీలో లివర్, కిడ్నీలు నాన్ స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవడం.. జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అప్పుడే మన బాడీ బ్యాలెన్స్‌డ్‌ గా హెల్దీగా పనిచేస్తుంది. లివర్, కిడ్నీలను నాచురల్‌గా క్లీన్ చేయడానికి 6 రకాల పండ్లను మీ డైట్‌లో చేర్చండి. ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేరేడు పండ్లు

ముఖ్యంగా వీటి గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి ఇవి కిడ్నీలకు అద్భుతమైన రక్షణను అందిస్తాయి. ఇది శరీర మెటబాలిజాన్ని మెరుగుపరచడంతో పాటు కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారానికి ఒకసారి నేరేడు పండ్లు తిన్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

దానిమ్మ

దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లివర్‌ ను, కిడ్నీలను ఫుల్ సేఫ్‌ గా ఉంచుతాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే డ్యామేజ్‌ ను తగ్గించి.. రెండు అవయవాల పనితీరును టాప్‌లో ఉంచుతాయి.

బొప్పాయి

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ లివర్ క్లీనింగ్‌ కు గ్రేట్ హెల్ప్ చేస్తుంది. ఇది టాక్సిన్స్‌ ను బాడీ నుంచి బయటికి పంపడంలో సపోర్ట్ చేస్తుంది. విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ బాగా ఉండటంతో ఫ్యాటీ లివర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆయుర్వేదంలో కూడా బొప్పాయికి స్పెషల్ ప్లేస్ ఉంది.

క్రాన్బెర్రీ

క్రాన్బెర్రీలు పవర్‌ ఫుల్ డిటాక్సిఫైయింగ్ గుణాలున్న పండ్లు. ఇవి కిడ్నీలు, లివర్‌ లో ఉండే డేంజరస్ బ్యాక్టీరియాను తీసేయడంలో హెల్ప్ చేస్తాయి. దీని వల్ల క్రానిక్ ఇన్‌ ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

మోసంబి

మోసంబి కేవలం జీర్ణవ్యవస్థను ఇంప్రూవ్ చేయడమే కాదు.. లివర్, కిడ్నీలను కూడా డిటాక్స్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే లిమోనాయిడ్ పదార్థాలు లివర్‌ లోని టాక్సిన్లను తీసేయడంలో హెల్ప్ చేస్తాయి. వారానికి ఒకసారి తీసుకుంటే నాచురల్ డిటాక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ ఒక నాచురల్ డయూరెటిక్. ఇది యూరిన్ ద్వారా కిడ్నీల నుంచి టాక్సిన్లను బయటికి పంపేస్తుంది. అంతేకాకుండా లివర్‌ ను కూడా క్లీన్ చేస్తుంది. దీని వల్ల రెండు అవయవాలు స్మూత్‌ గా పనిచేస్తాయి.

హార్ట్‌ను కాపాడుకున్నట్లే.. మన లివర్, కిడ్నీల పైనా కేర్ తీసుకోవాలి. రోజూ ఈ హెల్దీ ఫ్రూట్స్‌ ను మీ డైట్‌ లో చేర్చుకోవడం ద్వారా ఈ ముఖ్యమైన అవయవాలు క్లీన్‌ గా, హెల్దీ గా ఉండటమే కాదు.. ఫుల్ ఎనర్జీతో పనిచేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)