Iron Rich Foods: రక్తం తక్కువై బలహీనంగా ఉన్నారా..? అయితే ఈ 10 ఐరన్ ఫుడ్స్ తినడం మిస్ కాకండి..!
మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరంలోని ఆక్సిజన్ ను అన్ని చోట్లకి చేర్చడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత, అలసట, శక్తి లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఐరన్ ఎక్కువగా ఉన్న టాప్ 10 ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

ఎర్ర మాంసం ఐరన్ కు ముఖ్యమైన వనరు. 100 గ్రాముల ఎర్ర మాంసంలో సుమారు 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీన్ని హీమర్ ఐరన్ అంటారు. ఇది శరీరంలో సులభంగా కలిసిపోతుంది. ఎర్ర మాంసం తినడం వల్ల రక్తహీనత శక్తి లేకపోవడం లాంటి సమస్యలను నివారించవచ్చు.
పాలకూరలో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో సుమారు 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. ఇది సులభంగా దొరికే ఆకుకూర కాబట్టి రోజువారీ ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలి. పాలకూరలోని ఐరన్ శరీరానికి తగిన ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది.
సముద్రంలో పెరిగే చేపలు ఐరన్ కు సహజ వనరులు. చేపల్లో ఉండే ఇతర పోషకాలతో పాటు ఐరన్ శక్తివంతంగా ఉంటుంది. మాంసాహారంగా చేపలను ఆహారంలో చేర్చుకుంటే.. శరీరానికి తగిన ఐరన్ అందుతుంది.
బెల్లంలో ఐరన్ ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఈ బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి. బెల్లం తినడం వల్ల రక్తం శుభ్రంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్, ఆఫ్రికాట్ లాంటి ఎండుపండ్లు ఐరన్ ఎక్కువగా కలిగిన వాటిలో ఉన్నాయి. వీటిని రోజువారీ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. షుగర్ లాంటి జబ్బులు ఉన్న వారు వీటిని జాగ్రత్తగా, పరిమితంగా తీసుకోవాలి.
గుమ్మడి గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్మూతీస్ లో లేదా ఇతర పానీయాలలో కలిపి తీసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఈ గింజలను ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే పోషకాలు అరుగుదల శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
నువ్వులు ఐరన్ తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఇస్తాయి. 100 గ్రాముల నల్ల నువ్వుల్లో సుమారు 13.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. కాబట్టి రోజుకు కొద్దిగా గుప్పెడు నువ్వులను ఆహారంలో చేర్చడం శరీరానికి మంచిది.
మెంతులు కూడా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో ఒకటి. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. రోజువారీ పప్పు, కూరల్లో మెంతులు చేర్చుకుంటే, శరీరంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి. అలాగే మెంతులు అరుగుదలకు కూడా మేలు చేస్తాయి.
పప్పులు, ధాన్యాలు కూడా ఐరన్ తో పాటు ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలతో నిండి ఉంటాయి. వీటిని సాధారణ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గి శక్తి పెరుగుతుంది. పప్పు వంటలతో మనం ఈ పోషకాలను సులభంగా పొందవచ్చు.
డార్క్ చాక్లెట్ కూడా ఐరన్ అందించే చక్కటి వనరు. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ లో సుమారు 11.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తక్కువ చక్కెరతో కూడిన డార్క్ చాక్లెట్ తీసుకోవడం శరీరానికి మంచిది. ఐరన్ సమృద్ధిగా లభించే ఈ ఆహారాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత, అలసట, శక్తి లేకపోవడం లాంటి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
