Tomato Juice Health Benefits: మన దేశంలో టమోటాలను ఎక్కువగా వంటలు, కూరల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పలు ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, ఫోలేట్‌తో పాటు క్యాల్షియం సమృద్ధిగా తీసుకోవచ్చు. వీటిని కూరల్లోనే కాకుండా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. మరిన్ని ప్రయోజనాలు పొందడానికి టమోటా జ్యూస్, సూప్‌ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
కళ్లకు మేలు
టమోటా రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.
మధుమేహం
టమోటా రసంలో విటమిన్ సి, పొటాషియం, కెరోటిన్, విటమిన్ ఇ, ఫోలేట్, కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ కోసం
టమోటా రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతోప ఆటు లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంగా మార్చడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి టమోటా రసం రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.
బరువు తగ్గడానికి
టమోటో రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు..
టమోటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇబ్బంది పెడుతుంటే రోజూ ఒక గ్లాసు టమోటా జ్యూస్ తీసుకోవచ్చు.
ట్యాక్సిన్లు తొలగించడంలో..
టమోటా రసం శరీరం నుండి విష పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
గుండెకు ప్రయోజనకరం
టమాటోలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి