Tomato Flu: దేశంలో టమాట ఫ్లూ టెన్షన్‌.. ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకుంటే మేలంటున్న నిపుణులు

| Edited By: Ravi Kiran

Aug 25, 2022 | 7:05 AM

Health Tips: దేశంలో టమాట ఫ్లూ కలకలం రేపుతోంది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​గా పిలిచే ఈ వ్యాధి మొదట కేరళలో బయటపడింది. ఆ తర్వాత తమిళనాడు, ఒడిశా, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది.

Tomato Flu: దేశంలో టమాట ఫ్లూ టెన్షన్‌.. ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకుంటే మేలంటున్న నిపుణులు
Immunity Booster Foods
Follow us on

Health Tips: దేశంలో టమాట ఫ్లూ కలకలం రేపుతోంది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​గా పిలిచే ఈ వ్యాధి మొదట కేరళలో బయటపడింది. ఆ తర్వాత తమిళనాడు, ఒడిశా, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం దేశంలో టమాట ఫ్లూ కేసుల సంఖ్య 82కు చేరుకుంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. టమాట ఫ్లూ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్‌ చేసింది. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. టమాట ఫ్లూ బారిన పడినవారికి జ్వరం, ఎర్రటి దద్దుర్లు, కీళ్ల నొప్పులు, అలసట, బలహీనత తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఈపరిస్థితుల్లో ఈ మాయదారి రోగం నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతంగా మారి వ్యాధి సంక్రమణతో పోరాడటానికి శక్తి లభిస్తుందంటున్నారు. మరి ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో ఓసారి చూద్దాం రండి.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. పసుపును పాలలో కలిపి తీసుకోవచ్చు. వీటిలోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో నిమ్మ, నారింజ మరియు టాన్జేరిన్ వంటి పండ్లు ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఫలితంగా టమాట ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని పొందుతారు.

పాలకూర

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. పాలకూరలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. దీనిని స్మూతీస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

బొప్పాయి

బొప్పాయి చాలా ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో బి విటమిన్లు, పొటాషియం ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం