Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.. తస్మాత్ జాగ్రత్త
చాలా మంది వైద్యులను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడతారు లేదా వినియోగిస్తారు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీస్తుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు కూడా మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చు

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలోని విష తుల్య పదార్థాలను బయటకు పంపించి డీటాక్సిఫై చేస్తాయి. కిడ్నీలు సక్రమంగా పని చేయకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల నేటి తరం యువకుల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తలతో పాటు సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇక చాలా మంది వైద్యులను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడతారు లేదా వినియోగిస్తారు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీస్తుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు కూడా మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముందుగానే కిడ్నీ జబ్బుల లక్షణాలను పసిగట్టడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు.
మూత్రపిండాలు దెబ్బతింటే?
– మూత్రవిసర్జనలో సమస్యలు
– మూత్ర విసర్జన సమయంలో రక్తం




– శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
– చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది
– వాంతులు
– ఛాతీ నొప్పి, తీవ్ర ఒత్తిడి.
– గుండెపోటు
తరచూ పరీక్షలు.. కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండాలంటే కనీసం సంవత్సరానికి ఒకసారి మూత్ర, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోండి. అంతే కాకుండా ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
రిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి




