Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి.. సింపుల్ టిప్స్.. ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
మారుతున్న జీవనశైలిలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య బరువు పెరిగిపోవడం, ఎక్కువ బరువు పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలతోనూ బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బరువు వల్ల ఏదైనా శ్రమతో..
మారుతున్న జీవనశైలిలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య బరువు పెరిగిపోవడం, ఎక్కువ బరువు పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలతోనూ బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బరువు వల్ల ఏదైనా శ్రమతో కూడిన పనిచేస్తే ఆయాసం రావడం, ఎక్కవు దూరం నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈక్రమంలో అధిక బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు. కానీ వాస్తవానికి చాలావరకు వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే బరువు తగ్గొచ్చని వివరిస్తున్నారు. బరువు తగ్గడం కోసం ఇటీవల కాలంలో హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటం ఎక్కువైంది. అయితే హెర్బల్ ప్రొడక్ట్స్ వల్ల బరువు తగ్గుతారా.. లేదా అనేది పక్కన పెడితే వాటిని వాడేటప్పుడు రోజూ వారి తీసుకునే ఆహారంలో కొన్ని పరిమితులు పాటించాల్సి ఉంటుంది. అందుకే సహజంగా జీవనశైలిలో స్వల్ప మార్పులతో బరువు తగ్గవచ్చుంటున్నారు నిపుణులు.
పీచు పదార్థాలు
ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూసుకోవాలి. రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి. కానీ చాలా మంది తగినంత పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యయనాలు ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని నిరూపిస్తున్నాయి. ఇది ఎలా సహాయపడుతుంది?
నీరు
నీళ్లు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. తగినంత నీరు తీసుకోవాలి. నీళ్లు జీవక్రియను పెంచుతాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి.
వ్యాయామం
యోగ, ఏరోబిక్ వ్యాయామం చేస్తే శరీరంలోని కేలరీలు తగ్గి బరువు తగ్గుతారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మంచిది.
నిద్ర
చాలా మంది సరిగా నిద్రపోరు. దీని వల్ల వారు బరువు పెరిగే అవకాశం ఉంది. అలా అని ఎక్కువగా నిద్ర పోయినా సమస్యలు వస్తాయి. తొందరగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
ప్రోటీన్
బరువు తగ్గడానికి ప్రోటీన్ అతి ముఖ్యమైన పోషకం. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల రోజుకు 80–100 కేలరీలు తగ్గించే జీవక్రియను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి.
చిన్న చిన్న మార్పులు
చిన్న చిన్న మార్పులే చాలా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. దగ్గర్లోలో షాపింగ్ వెళ్లాల్సిన సమయంలో బైక్, కారుకు బదులుగా నడుచుకుంటూ వెళ్లి హాయిగా షాపింగ్ చేసి రండి.
అల్పాహారం
చాలామంది ఉదయాన్నే టిఫిన్ తినరు. ఏముందిలే అనుకుంటారు. కానీ ఇది చాలా పొరపాటు టిఫిన్ తినకపోతే బరువు తగ్గడం కాదు బరువు పెరుగుతారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..