Winter Food: చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోవాల్సిందే..
Winter Food: మనం తీసుకునే ఆహారం చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని మనలో చాలా మందికి తెలియదు. కేవలం శరీరం లోపల జరిగే మార్పులకే ఆహారం కారణమవుతుందని అంతా భావిస్తుంటాం. కానీ...
Winter Food: మనం తీసుకునే ఆహారం చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని మనలో చాలా మందికి తెలియదు. కేవలం శరీరం లోపల జరిగే మార్పులకే ఆహారం కారణమవుతుందని అంతా భావిస్తుంటాం. కానీ చర్మం ఆరోగ్యంపై కూడా ఆహార ప్రభావం ఉంటుందని మీకు తెలుసా.? ఇక చలి కాలంలో వచ్చిందంటే చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చలి వల్ల చర్మం కాంతి హీనంగా మారడం, డ్రై అవ్వడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే అలా కాకుండా చర్మం ప్రకాశవంతంగా మెరావాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మెనూలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవంటే..
* చాలా మంది చలికాలంలో నీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. వాతావరణం ఎలాగో చల్లగా ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే కాలమేదైనా శరీరానికి సరిపడ నీరు అందకపోతే చర్మం ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సరిపడ నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురై పొడి బారుతుంది. కాబట్టి కచ్చితంగా నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉండేలా చూసుకోవాలి. దీని కారణంగా చర్మం ఎప్పుడూ తడిగా ఉంటుంది. అలాగే చర్మంపై వచ్చే ముడతలు కూడా రావు. వాల్‌నట్స్, చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి.
* విటమిన్ ఏ, సిలు పుష్కలంగా లభించే నారింజ, ద్రాక్షలను చలికాలంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు స్వీట్ పొటాటోస్, క్యారెట్, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడంతో పాటు దురద వంటి సమస్యలు దరిచేరు.
* చర్మం ఆరోగ్యంలో అవకాడో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాట్స్, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని ప్రోటీన్లు చర్మం వదులుగా కాకుండా చూసుకుంటాయి.
* చలికాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో పాలకూర కూడా ఒకటి. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ,సిలతో పాటు యాంటీఆక్సిడెంట్‌లు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతాయి.
Also Read: Priyamani: మతి పోగొట్టే అందాలతో ఫ్యాన్స్ మనసులను దోచుకుంటున్న ఢీ భామ ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచిత తాగునీటి పథకం గడువు పొడిగింపు