West Indian Lantana: పిచ్చి మొక్క కాదు.. పాము కాటుకి సూపర్ మెడిసిన్ !! వీడియో
మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు మానవాళికి వరాలుగా చెప్పొచ్చు. మనం పిచ్చి మొక్కలుగా భావించే మొక్కల్లో మన ప్రాణాలను సైతం కాపాడే ఔషధాలు ఉంటాయని మనకు తెలియదు.
మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు మానవాళికి వరాలుగా చెప్పొచ్చు. మనం పిచ్చి మొక్కలుగా భావించే మొక్కల్లో మన ప్రాణాలను సైతం కాపాడే ఔషధాలు ఉంటాయని మనకు తెలియదు. అలాంటిదే తలంబ్రాల మొక్క. పొదలాగా పెరిగే ఈ మొక్క లాంటానా జాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప చెట్టు అని కూడా అంటారు. ఈరోజు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపించే తలంబ్రాల చెట్టు స్వస్థలం ఆఫ్రికా, అమెరికా ఖండాలు. ఈ చెట్టును ఫర్నీచర్ తయారీకి, బుట్టలు అల్లడానికి ఉపయోగిస్తారు. ఇక ఈ తలంబ్రాల చెట్టు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. తలంబ్రాల చెట్టు ఆకుల్లో క్రిమినాశక, యాంటీమైక్రోబయాల్ లక్షణాలున్నాయి. ఇవి గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు మీజిల్స్, చికెన్ పాక్స్, గజ్జి ,చర్మ ఫంగస్‌ను తగ్గించడానికి శక్తివంతమైన మందుగా ఈ ఆకులను ఉపయోగిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Digital News Round Up: పెళ్లి మంటపంలో తుపాకీ మోతలు | జలపాతం వెనక అఖండ దీపం
Big News Big Debate: ఏపీ లో హైటెన్షన్ పాలిటిక్స్.. లైవ్ వీడియో