
అన్ని కాలాలు వేరు.. చలి కాలం వేరు. ఇలా వాతావరణ మార్పుల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతూ ఉంటుంది. దీంతో వివిధ రకాల సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతులో ఇన్ ఫెక్షన్స్ సోకడం ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అంతే కాకుండా మలేరియా, టైఫాడ్, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే చలికాలంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒక సారి ఇప్పుడు చూద్దాం.
చలి కాలంలో ఉండే వాతావరణానికి చాలా మంది బద్ధకిస్తూంటారు. దీంతో బరువు పెరిగి పోతూ ఉంటారు. ఇమ్యూనిటీ కూడా తగ్గి పోతుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం చేయడం చాలా మంచిది. వాకింగ్ లేదా జాగింగ్, ఎక్సర్ సైజ్ ఇలా ఎవరి పరిధి బట్టి చేయాలి. వ్యాయామం చేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
సరైన నిద్ర వల్ల కూడా వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడు కోవచ్చు. ప్రతి రోజూ 7 లేదా 8 గంటలు నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.
వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం వేయదు. దీంతో నీటిని చాలా తక్కువగా తీసుకుంటారు. దీని వల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా చర్మం పొడిబారిపోయి.. నిర్జీవంగా మారుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకుంటేనే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల వైరల్ వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి.
మీరు తినే ఆహారంలో ఎక్కువగా ఫ్రెష్ కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ఇవి తినడం వల్ల శరీరం హెల్దీగా, ఫిట్ గా ఉంటారు.
చలి కాలంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఏం తినాలన్నా ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు శరీరంలో లోపలికి వెళ్ల కుండా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ఖచ్చితంగా చేతులను కానీ, కర్ఛీఫ్ లను అడ్డు పెట్టుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.