AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఈ లక్షణాలు లైట్ తీసుకోకండి.. కిడ్నీ సమస్య కావొచ్చు.

అయితే మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కిడ్నీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ముఖ్యంగా మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న లైఫ్‌ స్టైల్‌ కారణంగా కిడ్నీలు అనారోగ్యం బారిన పడుతున్నాయి. అయితే కిడ్నీల సమస్యలను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే..

Health: ఈ లక్షణాలు లైట్ తీసుకోకండి.. కిడ్నీ సమస్య కావొచ్చు.
Kidney Problems
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 10:30 AM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పనితీరు కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తేనే అన్ని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కిడ్నీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ముఖ్యంగా మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న లైఫ్‌ స్టైల్‌ కారణంగా కిడ్నీలు అనారోగ్యం బారిన పడుతున్నాయి. అయితే కిడ్నీల సమస్యలను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* కిడ్నీల్లో సమస్యలు ఏర్పడినప్పుడు రక్తంలో విషపదార్ధాలు క్రమంగా పేరుకుపోతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చాలా త్వరగా అలసిపోతారు. అదే సమయంలో, కొంచెం నడిచినా కూడా బలహీనంగా మారుతారు. కిడ్నీ వ్యాధి రక్తహీనత, అలసట, బలహీనతకు దారి తీస్తుంది.

* కిడ్నీల్లో సమస్యలు ఏర్పడినప్పుడు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీంతో శరీరంలోని మలినాలు బయటకు రావు. ఇది కాలక్రమేణ నిద్రలేమి, ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* మూత్ర పిండాల పనితీరు దెబ్బతింటే చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబాడరం, దురద వంటి సమస్యలు వస్తాయి.

* మూత్ర పిండాలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా మూత్ర విసర్జనపై ప్రభావం పడుతుంది. అధికంగా మూత్ర విసర్జన వస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రంలో రక్తం పడినా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఈ లక్షణం కూడా మూత్ర పిండాలు పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us