AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో ఖర్జూరం ఇలా తీసుకోండి.. వారంలోనే మార్పు గమనిస్తారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, హార్మోన్ల సమతుల్యతలో కూడా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా ఖర్జూరంను ఉదయం పడగడుపున తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్జూరాన్ని నెయ్యిలో నానబెట్టి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందొచ్చని చెబుతున్నారు...

ఖాళీ కడుపుతో ఖర్జూరం ఇలా తీసుకోండి.. వారంలోనే మార్పు గమనిస్తారు.
Health
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 10:45 AM

Share

ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, హార్మోన్ల సమతుల్యతలో కూడా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా ఖర్జూరంను ఉదయం పడగడుపున తీసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్జూరాన్ని నెయ్యిలో నానబెట్టి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాన్ని ఉదయాన్నే తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని విటమిన్‌ ఏ, సి లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మరోవైపు, నెయ్యి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో ఇది శరీరాన్ని చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

* ఖర్జూరం, నెయ్యి కలిపి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరాల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరోవైపు, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతాయి. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఖర్జూరం, నెయ్యి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఖర్జూరంలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

* హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడానికి నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం ఉపయోగపడుతుంది. ఖర్జూరంలోని విటమిన్లు, ఖనిజాలు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఉపయోగపడుతుంది.

* నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల ఇన్‌స్టంట్‌ ఎనర్జీ లభిస్తుంది. ఉదయం పడగడుపున ఖర్జూరాన్ని ఇలా తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us