AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Food: ఒత్తిడి వేధిస్తోందా..? ఈ పండ్లను తింటే మార్పు ఖాయం..

విపరీతమైన ఒత్తిడి ప్రస్తుతం ఒక అనారోగ్య సమస్యగా మారిపోయింది. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదించే రోజులు వచ్చేశాయి. సాధారణంగా వైద్యులు ఒత్తిడికిని తగ్గించేందుకు మందులను సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడిని చిత్తు చేయొచ్చని మీకు తెలుసా.?

Stress Food: ఒత్తిడి వేధిస్తోందా..? ఈ పండ్లను తింటే మార్పు ఖాయం..
Stress
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 11:15 AM

Share

ప్రస్తుత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రంగం ఏదైనా ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. పోటీతో కూడుకున్న ఈ ప్రపంచంలో ప్రతీ పనిలో ఒత్తిడి కామన్‌గా మారిపోయింది. దీంతో ఒత్తిడి కారణంగా మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దుష్ప్రభావం పడుతుంది. విపరీతమైన ఒత్తిడి ప్రస్తుతం ఒక అనారోగ్య సమస్యగా మారిపోయింది. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదించే రోజులు వచ్చేశాయి. సాధారణంగా వైద్యులు ఒత్తిడికిని తగ్గించేందుకు మందులను సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడిని చిత్తు చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ ఒత్తిడిని దూరం చేసే ఆ పండ్లు ఏంటి.? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒత్తిడిని చిత్తు చేయడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది. అరటి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ బీ6 వంటి పోషకాలు ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. పొటాషియం అనేది శరీర కణాల ఆరోగ్యకరమైన పనితీరును నిర్వహించడానికి సహాయపడే ఒక ఖనిజం. ఇది ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. మెగ్నీషియం ఒత్తిడి, నిరాశతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ B6 సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

* ఒత్తిడికి యాపిల్‌ కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోగపడతాయి. రోజూ ఒక యాపిల్ తింటే ఒత్తిడి తగ్గుతుంది. యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది శరీర ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

* ఒత్తిడిని నుంచి ఉపశమనం కల్పించడంలో దానిమ్మ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

* పియర్ పండు కూడా ఒత్తిడిని చిత్తు చేస్తుంది. పియర్‌లో విటమిన్‌ బి, విటమిన్‌ ఈ శరీరానికి మేలు చేస్తాయి. ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. బి విటమిన్లు సెరోటోనిన్ అనే కొన్ని రసాయనాలను తయారు చేస్తాయి. సెరోటోనిన్ అనేది మెదడులో కనిపించే రసాయనం. ఇది మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..