Pregnancy Food: కాబోయే అమ్మలూ జంక్ ఫుడ్ తింటున్నారా.? అయితే మీతో పాటు, మీ చిన్నారికీ కూడా..
Pregnancy Food: సాధారణ పరిస్థితులతో పోలిస్తే గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలు ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని మనందరికీ తెలిసిందే. ఇక తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి...
Pregnancy Food: సాధారణ పరిస్థితులతో పోలిస్తే గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలు ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని మనందరికీ తెలిసిందే. ఇక తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులను చెబుతుంటారు. అయితే మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో ఏదో ఒకటి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు జంక్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..
* సాధారణంగా జంక్ ఫుడ్ తయారీలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సర్జరీ సమయంలో ఇది ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
* ఇక కొన్ని రకాల జంక్ ఫుడ్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారిలోఅకాల ప్రసవానికి దారితీసే ప్రమాదం ఉంటుంది.
* జంక్ ఫుడ్‌లో ప్రత్యేకంగా ఎలాంటి పోషకాలు ఉండకపోగా..వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులోని చిన్నారుల మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది చిన్నారుల ఎదుగుదలపై దుష్ఫ్రభావం చూపుతుంది.
* సహజంగానే గర్భదారణ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు. ఇలాంటి సమయాల్లో జంక్ పుడ్ తీసుకుంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా అసహజంగా బరువు పెరగడం ఇటు తల్లితో పాటు కడుపులోని చిన్నారికి కూడా ఏమాత్రం క్షేమదాయం కాదు.
కాబట్టి గర్భిణీలు వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, డ్పైఫ్రూట్స్ వంటివి తీసుకోవడం వల్ల పుట్టబోయే చిన్నారులు పూర్తి ఆరోగ్యంగా జన్మిస్తారు.
Also Read: Health Tips: బరువు తగ్గడం కొవ్వు తగ్గడం ఒక్కటేనా..! ఈ రెండింటి మధ్య తేడా ఏంటి..?
Health Tips: ఈ అలవాట్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువేనట.. అవెంటో తెలుసుకోండి..