Health Tips: బరువు తగ్గడం కొవ్వు తగ్గడం ఒక్కటేనా..! ఈ రెండింటి మధ్య తేడా ఏంటి..?

Health Tips: చాలామంది బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం ఒకటేనని భావిస్తారు. కానీ ఇవి రెండు వేర్వేరు పనులు. బరువు తగ్గడం అనేది మొత్తం శరీరం ఎన్ని కిలోలు తగ్గిందో

Health Tips: బరువు తగ్గడం కొవ్వు తగ్గడం ఒక్కటేనా..! ఈ రెండింటి మధ్య తేడా ఏంటి..?
Weight Loss
Follow us

|

Updated on: Sep 25, 2021 | 9:00 PM

Health Tips: చాలామంది బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం ఒకటేనని భావిస్తారు. కానీ ఇవి రెండు వేర్వేరు పనులు. బరువు తగ్గడం అనేది మొత్తం శరీరం ఎన్ని కిలోలు తగ్గిందో సూచిస్తుంది. శరీరంలో కండరాలు, కొవ్వు, నీరు అన్ని కలిసి ఉంటాయి. కానీ కొవ్వు కోల్పోవడం అంటే కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. దీర్ఘ కాలంలో బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎంత తగ్గారో తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బరువు యంత్రంతో చాలా సులువుగా ఎంత తగ్గారో తెలుసుకోవచ్చు. మీరు నిర్ధిష్ట కాలంలో ఎంత బరువు తగ్గారో సులువుగా తెలుస్తుంది. అయితే మీరు బరువు కోల్పోతున్నారా లేదా కొవ్వు పెంచుకుంటున్నారా అనేది వెయిట్‌ మిషన్ చెప్పదు. ఇందుకోసం మీరు కొవ్వు పరీక్ష లేదా బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ స్కేల్ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు శరీరం నుంచి ఎంత కొవ్వు కోల్పోయారో తెలుస్తుంది.

శరీరంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి వ్యాధులకు గురవుతారు. శరీరంలో కొవ్వు శాతం ఆడ, మగవారికి వేరుగా ఉంటుంది. అంతేకాదు ఇది వయస్సు ఆధారంగా మారుతుంది. ఆరోగ్యకరమైన శరీర కొవ్వు శాతాన్ని నిర్వహించడం వల్ల మీరు దృఢంగా కనిపిస్తారు అంతేకాదు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

కొవ్వు తగ్గడం అనేది దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి మార్గం. బరువు తగ్గడంతో పోలిస్తే, కొవ్వు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. బరువు తగ్గితే సులువుగా మళ్లీ పెరగవచ్చు. కానీ కొవ్వు తగ్గితే అంత తొందరగా తిరిగి పొందలేము. అన్ని డైట్లు, ట్రిక్స్ బరువు తగ్గడానికి మాత్రమే సహాయపడతాయి కొవ్వు తగ్గడానికి కాదు. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ జోడించడం వల్ల కండరాల ద్రవ్యరాశి పెరుగుతుంది. అప్పుడే కొవ్వు తగ్గుతుంది.

AP CM Jagan: తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు..

Rice Water Benefits: బియ్యం నీటిని వేస్ట్ చేస్తున్నారా..! ఈ సమస్యకి చక్కటి పరిష్కారమని మీకు తెలుసా..?

Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..