Rice Water Benefits: బియ్యం నీటిని వేస్ట్ చేస్తున్నారా..! ఈ సమస్యకి చక్కటి పరిష్కారమని మీకు తెలుసా..?

జుట్టు సమస్య.. చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. జుట్టు రాలడం.. పొడిబారడం.. సన్నగా.. పల్చగా మారడం.. చుండ్రు వంటి సమస్యలు చాలా

Rice Water Benefits: బియ్యం నీటిని వేస్ట్ చేస్తున్నారా..! ఈ సమస్యకి చక్కటి పరిష్కారమని మీకు తెలుసా..?
Rice Water
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2021 | 7:57 PM

జుట్టు సమస్య.. చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. జుట్టు రాలడం.. పొడిబారడం.. సన్నగా.. పల్చగా మారడం.. చుండ్రు వంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలు, రకరకాల నూనెలు ఉయోగించడం.. చికిత్సలు తీసుకోవడం చేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం అంతంతా మాత్రంగానే ఉంటుంది. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి బియ్యం నీరు ఎక్కువగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీరు జుట్టుకు మాత్రమే కాకుండా.. చర్మానికి కూడా ఎక్కువగా పనిచేస్తాయి. జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.

1. ఒక కప్పు బియ్యాన్ని రెండు కప్పుల నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యాన్ని వడకట్టి.. ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సగం ఉల్లిముక్కను కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి ఉల్లిరసాన్ని వేరు చేయాలి. ఈ ఉల్లిపాయ రసాన్ని బియ్యం నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. 2. బియ్యం నీటిని వేడి చేసి అందులో తేనె కలపాలి. దానిని 5 నుంచి 10 నిమిషాల వరకు వేడి చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి.. దానిని జుట్టు మూలాలపై అప్లై చేయాలి. దానిని సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఉండనివ్వాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. 3. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేయాలి. గ్రీన్ టీలో ఒక కప్పు బియ్యం నీరు కలపాలి. షాంపూతో జుట్టును శుభ్రం చేసాక.. ఈ మిశ్రమాన్ని జుట్టుపై మసాజ్ చేయాలి. దీనిని 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Also Read: Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

Shiva Nirvana : అందమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ… ఆ హీరో కోసమేనా..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్